Viral Video: రెండు జెండాలతో సమతను చాటిన పాకిస్తాన్ అథ్లెట్..వీడియో వైరల్

కరాటే కాంబాట్ లీగ్‌లో విజయం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్ షహజైబ్ రింథ్ ను అందరూ తెగ పొగుడుతున్నారు. మ్యాచ్ విజయం తర్వాత అతను చూపించిన స్ఫూర్తి అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. పాకిస్తాన్, ఇండియా జెండాలతో పోడియం మీద నిలబడి అందరికీ ఆదర్శంగా నిలిచాడు షహజైబ్ రింథ్.

New Update
Viral Video: రెండు జెండాలతో సమతను చాటిన పాకిస్తాన్ అథ్లెట్..వీడియో వైరల్

Shahzaib Rind Vs Rana Singh: ఇండియా, పాకిస్తాన్...ఈ రెండు దేశాల గురించి తెలియనిది ఎవరికి. నిజానికి ఒకప్పుడు ఒకే దేశంగా ఉండి...తర్వాత విడిపోయి బద్ధ శత్రువుతగా మారిపోయారు. ఇది అయి 75 ఏళ్ళు పైన అవుతున్నా ఆ శత్రుత్వాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడో ఒక చోట ఇరు దేశాల మధ్య వైరం బయటపడుతూనే ఉంటుంది. అందులోకి ఆటల విషయంలోకి వస్తే ఇది మరింతగా కనిపిస్తుంది. సాధారణంగా భారత్, పాకిస్తాన్ (India - Pakistan) మధ్య ఏ గేమ్ జరిగినా.రెండు జట్లు...లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీలా కాకుండా రెండు దేశాల మధ్య పోటీగా మారిపోతుంటుంది. క్రికెట్ అలాంటి వాటిల్లో అయితే జనాలు కొట్టుకునే స్థాయి వరకు కూడా ఉంటుంది అ వైరం. ఆటగాళ్ళ మధ్య ఇలాంటి భావనలు లేకపోయినా..ఆ సమయానికి వాతావరణానికి తగ్గట్టు వారు కూడా అలా మారిపోతారు. కానీ దీనికి అతీతంగా ప్రవర్తంచారు పాకిస్తాన్ కరాటే ఆటగాడు. అతను చేసిన పనికి రెండు దేశాల ప్రజలు ఫిదా అయిపోతున్నారు.

ఇరు దేశాల జెండాలతో పోడియం మీదకు...

ఇండియా, పాకిస్తాన్ ఆటగాళ్ళ మధ్య కరాటే కాంబాట్ లీగ్ (Karate Combat League) పైనల్ పోటీ జరిగింది. ఇందులో ఇరు దేశాల ఆటగాళ్ళు పోటీపోటీగా తలపడ్డారు. కానీ చివరకు పాకిస్తాన్ ప్లేయర్ షహజాబ్ రింథి గెలిచాడు. షహజాబ్ రింధి 2-1తో భారత ఆటగాడు రానా సింగ్‌ను ఓడించాడు. నిజానికి ఇది చాలా మామూలు గేమ్. ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏంలేదు. క్రికెట్, మిగతా ఆటల్లా కరాటే అంత పాపులర్ కూడా ఏమీ కాదు. కానీ గేమ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాడి గెస్చర్ ఈ మొత్తం వ్యవహారంగ ఉరించి మాట్లాడుకునేలా చేసింది. పోటీలో విజయం సాధించిన తర్వాత ఏ గేమ్‌లో అయినా ఆటగాళ్లు తమ దేశ పతాకంతో బహుమతిని అందుకోవడానికి వెళతారు. అయితే షహజాబ్ మాత్రం బహుమతిని అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఇండియా, పాకిస్తాన్ రెండు జెండాలతో పోడియం మీదకు వెళ్ళాడు. ఇదిగో షహజాబ్ చేసిన ఈ పనే అందరూ మాట్లాడుకునేలా చేసింది.

వైరం కాదు స్నేహమే ఉంది..

తాను చేసిన పని గురించి పాకిస్తాన్ ఆటగాడు షహజాబ్ మాట్లాడుతూ..మా ఇద్దరి మధ్యా ఫైట్ పీస్ గురించి జరిగింది. మా అటలో కానీ...మేము చేసిన పనిలో కానీ వైరానికి తావే లేదు. మేము ఎప్పుడూ శత్రువలం కాదు. ఇద్దరం కలిస్తే ఏదైనా సాధించగలుగుతాం. మా ఇద్దరి మధ్యా పోటీ ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య స్నేహ బంధానని పెంపొందించేలా చేస్తుంది. అందుకే తాను రెండు జెండాలతో వేదిక మీదకు వచ్చాననని చెప్పాడు షెహజాబ్. దాంతో పాటూ తమ పాటను చూడ్డానికి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ను కూడా షెహజైబ్ థాంక్స్ చేప్పాడు. తాను చిన్నప్పటి నుంచి సల్మాన్ సినిమాలను చూస్తూ పెరిగానని..ఈ రోజు ఇలా ఆయనను కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పాడు.

ఎంత గొప్పగా చెప్పాడో..

షెహజైబ్ చేసిన పని అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతనికి భారతీయులు అందరూ ఫిధా అవుతున్నారు. ఎంత గొప్పగా మాట్లాడాడు అంటూ తెగ పొగడ్తల్లో ముంచేస్తున్నారు నెటిజన్లు. అందరూ అతని నుంచి స్ఫూర్తి పొందాలని అంటున్నారు.

Also Read:Gujarat: సూరత్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి..పోటీయే లేదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయని అన్నారు

New Update
Donald Trump

Donald Trump

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమే.కానీ అవి ఎప్పుడూ ఉన్నాయిగా అని వ్యాఖ్యానించారు.కాగా..పాక్‌ ఏర్పడింది.1947 లో అని కూడా ట్రంప్‌ కు తెలీదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి విమర్శిస్తున్నారు.

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

ఇదిలా ఉంటే..జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read: Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Also Read:AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

Also Read: Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

trump | kashmir | Jammu and Kashmir | india | latest-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment