IND vs PAK: భారత్ తో మ్యాచ్.. ఆటగాళ్ల భావోద్వేగాలపై బాబర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో మ్యాచ్ పై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జూన్ 9న జరగనున్న దాయాదుల పోరుపై అందరిలాగే తమకు ఉత్కంఠగానే ఉంటుందన్నాడు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుందన్నాడు. By srinivas 02 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భాగంగా జూన్ 9న దాయుదుల (భారత్ - పాకిస్థాన్) పోరు జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో ఇప్పటివరకూ పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం చెలాయించగా.. ఈసారి ఇరుజట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా సాగనుంది. ఈ సదర్భంగా టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇంట్రోస్టింగ్ కామెంట్స్ చేశాడు. Back to work ⚡️ pic.twitter.com/xclBs6Uhig — Babar Azam (@babarazam258) May 5, 2024 ఈ మేరకు బాబర్ మాట్లాడుతూ.. భారత్ - పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. అభిమాన జట్టు గెలవాలనే ఫ్యాన్స్ కోరుకుంటారు. మాకూ చాలా టెన్షన్ ఉంటుంది. రూల్స్ అతిక్రమించకుండా మా శైలిలో క్రికెట్ ఆడేందుకు ట్రై చేస్తాం. తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ప్రశాంతంగా ఉండి ఆడగలిగితే ఫలితం అనుకూలంగా వస్తుందని నమ్ముతా. దానికి తగ్గట్టు సాధన చేయాల్సిందే. కెప్టెన్‌గా నాపై అంచనాలు ఉంటాయి. మెగా టోర్నీల్లో మరింత ఎక్కువ. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలి. అందరినీ ప్రోత్సహించాలి. ఈసారి రెండు జట్లు సమతూకంగానే ఉన్నాయి. బాగా ఆడిన వారిదే విజయం' అంటూ చెప్పుకొచ్చాడు. #2024-t20-world-cup #babar-azam #india-vs-pak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి