Salaar Bike : సలార్‌లో ప్రభాస్ నడిపిన బైక్‌ని సొంతం చేసుకునే బంపర్ ఛాన్స్..మిస్ చేసుకోకండి.!

సలార్ మూవీలో ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం అయితే ఎలా ఉంటుంది?ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం చేసుకునే బంపర్ ఆఫర్ ఒకటి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Salaar Bike : సలార్‌లో ప్రభాస్ నడిపిన  బైక్‌ని సొంతం చేసుకునే బంపర్ ఛాన్స్..మిస్ చేసుకోకండి.!

Salaar Bike : కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సలార్. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22, 2023న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసింది. నైజాంలో సలార్ రికార్డు సృష్టించింది. సాలార్ నైజాంలో 100 కోట్ల కలెక్షన్స్ వావ్ అనిపించింది. ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా టీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం 21 ఏప్రిల్ 2024న ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మాలో సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ సందర్భంగా స్టార్ మా టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.సాలార్ సినిమాలో ప్రభాస్ వాడిన ఐకానిక్ బైక్ గెలిచే ఛాన్స్ ఉందంటూ ప్రకటన వెలువడింది. ప్రసార సమయంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సరైన సమాధానమిచ్చిన వారు ఈ బైక్‌ను గెలుచుకునే అవకాశం ఉందని టీమ్ తెలిపింది. మరి ఈ కస్టమ్ మేడ్ బైక్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి.

సలార్ పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌పై అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కావడం లేదని, ఇంకాస్త టైమ్ పడుతుందని ఆ మధ్య వార్తలు జోరుగా వినిపించాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం సాలార్ 2 మే మొదటి వారంలో షూటింగ్ షురూ కానుంది. వచ్చే ఏడాది 2025లోనే విడుదల కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాగా ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ రాజా సాబ్ లో నటిస్తున్నాడు. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 80శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లో జరుగుతుందని.. ఆ ఇంటి సెట్‌కే దాదాపు 6 కోట్లు ఖర్చు చేశారట. హర్రర్  కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ మాత్రమే రూ. 175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ హిందీ హక్కులను సొంతం చేసుకుంది. మరోవైపు దక్షిణాది భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 150 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఎన్టీఆర్, నాని కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ పరశురాముడిగా, నాని కృపాచార్యగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు అశ్వినీదత్.

ఇది కూడా చదవండి: ఓటీటీలోకి టిల్లన్న ఎంట్రీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment