/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
Imroz Patel : హైదరాబాద్(Hyderabad) లో అనుష్క అగర్వాల్(Anushka Agarwal) తో తాండూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software Employee) ఇమ్రోజ్ పటేల్ (29) సహజీవనంలో ఉన్నాడు. ఆమె వేధింపులతో ఇమ్రోజ్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కానీ ఈ విషయం గురించి పోలీసులకు తెలిపినప్పటికీ కూడా వారు మాకు సహకరించడం లేదని : కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. అనుష్క అగర్వాల్ వేధింపులతో..ఇమ్రోజ్ నాలుగుసార్లు ఆత్మహత్య(Suicide) కు యత్నించాడని ఇమ్రోజ్ తల్లి తెలిపింది. నా కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని ఆమె పేర్కొంది. అనుష్క ఫోన్ చేయడంతోనే ఇమ్రోజ్ వెళ్లాడు. ఘటనాస్థలిలో ఆత్మహత్య గల ఆనవాళ్లు లేవని ఇమ్రోజ్ సోదరుడు ఆరోపించారు.
అనుష్కతోపాటు మరికొందరు కలిసి హత్య చేశారని వారు అంటున్నారు. ఇమ్రోజ్ నుంచి మమ్మల్ని దూరం చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు.