Gallup 2024: మా ఉద్యోగంలో చాలా కష్టపడుతున్నాం అంటూనే స్థిరంగా ఉంటున్న భారతీయులు 

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సును అంచనా వేయడం కోసం చేసే సర్వే Gallup 2024 రిపోర్ట్ వెల్లడైంది. దీని ప్రకారం మనదేశంలో 86 శాతం మంది ఉద్యోగులు చాలా కష్టపడుతున్నాం అని చెప్పారు. అదేసమయంలో భారతదేశం అత్యధిక ఉద్యోగుల స్థిరత్వం రేటు 32% గా ఉంది. 

New Update
Gallup 2024: మా ఉద్యోగంలో చాలా కష్టపడుతున్నాం అంటూనే స్థిరంగా ఉంటున్న భారతీయులు 

Gallup 2024:  మనదేశంలో ఎక్కువ శాతం ఉద్యోగస్తులు తాము అభివృద్ధి చెందుతున్నామని భావించడం లేదు. కేవలం 14 శాతం మంది మాత్రమే ఆ రకంగా ఫీల్ అవుతున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే 34 శాతం తక్కువ. మిగిలిన 86 శాతం మంది ఉద్యోగులు తాము అవసరానికి మించి కష్టపడాల్సి వస్తోందని గట్టిగా అనుకుంటున్నారు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ వర్క్‌ప్లేస్ తన Gallup 2024 రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. 

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సును అంచనా వేయడం కోసం Gallup 2024 సర్వే రిపోర్టు సిద్ధం చేస్తారు. ఈ సర్వే మూడు వర్గాలుగా విభజించారు. అభివృద్ధి చెందుతున్నామని భావిస్తున్నవారు.. పోరాడుతున్న వారు.. బాధపడుతున్నామనే వారు.. ఈ వర్గాలు.  ప్రస్తుత జీవిత పరిస్థితిని సానుకూలంగా ఉందని చెప్పిన వారు లేదా రాబోయే ఐదేళ్లలో తమ జీవితం బాగుపడుతుంది అని నమ్ముతున్నవారు అభివృద్ధి చెందుతున్నామని భావిస్తున్నవారి వర్గంలోకి వస్తారు.  

Gallup 2024 : వారి ప్రస్తుత జీవిత పరిస్థితిపై అనిశ్చిత లేదా ప్రతికూల అభిప్రాయాలు ఉన్నవారు, ఎక్కువ రోజువారీ ఒత్తిడిని అలాగే ఆర్థిక చింతలను ఎదుర్కుంటున్న ఉద్యోగులను "కష్టపడుతున్నారు" అని వర్గీకరించారు.  ప్రతికూల భవిష్యత్తు దృక్పథంతో ఉన్నవారు లేదా బాధాకరమైన జీవితం గడుపుతున్నట్టు భావిస్తున్నవారు బాధ అనే వర్గంలోకి వస్తారు. 

"తమకు ఆహారం, ఆశ్రయం(నివాసం కోసం ఇల్లు) ప్రాథమిక అంశాలు లేవని,  శారీరక నొప్పి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, విచారం, కోపానికి గురయ్యే అవకాశం ఉందని వారు చెప్పటం ఎక్కువగా జరుగుతుంది. వారికి ఆరోగ్య బీమా, సంరక్షణకు తక్కువ అవకాశాలున్నాయి. అలాగే రెట్టింపు కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నవారితో పోలిస్తే వీరికి ఆరోగ్య సమస్యలు భారంగా మారుతున్నాయి" అని బాధ అనే వర్గంలోకి చేర్చిన ఉద్యోగుల గురించి గాలప్ పేర్కొంది. 

ప్రాంతాలవారీగా చూసుకుంటే..
Gallup 2024: అభివృద్ధి చెందుతున్నామని భావిస్తున్న ఉద్యోగులలో అత్యల్ప శతం దక్షిణాసియా ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో 15% మంది మాత్రమే అభివృద్ధి చెందుతున్నామని భావిస్తున్నారు. ప్రపంచ సగటు కంటే ఈ ప్రాంత సగటులో 19 పాయింట్లు తక్కువ ఉన్నాయని రిపోర్ట్ చెబుతోంది. ఈ ప్రాంతంలో భారతదేశంలో 14% మంది మాత్రమే అభివృద్ధి చెందుతున్నామని భావిస్తున్నారు. ఇందులో నేపాల్ 22% గా రిపోర్ట్ చేసింది. తరువాత 14%తో భారత్ రెండో స్థానంలో ఉందని గాలప్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపినట్లు మనీ కంట్రోల్ మీడియా కథనం చెబుతోంది. 

ప్రాంతీయ అంతర్దృష్టులు
అభివృద్ధి చెందుతున్న ఉద్యోగులలో దక్షిణాసియా అత్యల్ప శాతంగా ఉందని, ఈ ప్రాంతంలో 15% మంది ప్రతివాదులు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారని గుర్తించారని, ప్రపంచ సగటు కంటే 19 శాతం పాయింట్లు తక్కువగా ఉన్నాయని నివేదిక హైలైట్ చేసింది. ఈ ప్రాంతంలో, భారతదేశం 22% వద్ద నేపాల్ తర్వాత కేవలం 14% మాత్రమే వృద్ధి చెందడంలో రెండవ అత్యధిక రేటును కలిగి ఉంది.

Also Read: నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. 

భావోద్వేగాలు ఇలా..
Gallup 2024: రోజువారీ భావోద్వేగాలకు సంబంధించి, 35% భారతీయ ఉద్యోగులు రోజువారీ కోపాన్ని అనుభవిస్తున్నట్లు నివేదించారు.  ఇది దక్షిణాసియాలో అత్యధికం. అయితే, భారతీయ ఉద్యోగుల్లో  32% మాత్రమే రోజువారీ ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని చెప్పారు.  శ్రీలంకలో 62% - ఆఫ్ఘనిస్తాన్‌లో 58%తో పోలిస్తే ఈ శాతం ఈ ప్రాంతంలో అత్యల్పంగా ఉంది.

ఉద్యోగ స్థిరత్వం..
అయినప్పటికీ, భారతదేశం అత్యధిక ఉద్యోగుల స్థిరత్వం రేటును 32% నిర్వహిస్తోంది.  ఇది ప్రపంచ సగటు 23% కంటే ఎక్కువగా ఉంది. చాలా మంది భారతీయ ఉద్యోగులు శ్రేయస్సు పరంగా ఇబ్బంది పడుతున్నారు లేదా బాధ పడుతున్నారు. అయినప్పటికీ.. వీరిలో గణనీయమైన భాగం తమ పనిలో నిమగ్నమై చేస్తున్న ఉద్యోగానికి కట్టుబడి స్థిరంగా ఉంటున్నట్లు ఇది సూచిస్తుంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు