Poonam Pande:పూనమ్ పాండే ప్రకటనకు మాదే బాధ్యత...స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ

మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటి పూనమ్ పాండే డెత్ పోస్ట్ ఎంత వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. ఏంటీ స్టంట్లు అంటూ అందరూ పూనమ్ మీద మండిపడ్డారు కూడా. అయితే తాజాగా ఈ వివాదస్పద ప్రచారానికి తమదే బాధ్యత అంటూ స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు తెలియజేసింది.

New Update
Poonam Pande:పూనమ్ పాండే ప్రకటనకు మాదే బాధ్యత...స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ

Poonam Pande Death Post:నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ఇన్స్ట్ఆగ్రామ్‌లో వచ్చిన పోస్ట్ పెద్ద దుమారమే లేపింది. అంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే మర్నాడు తాను చనిపోలేదని...క్యాన్సర్ ప్రచారం కోసం అలా చేశానని తానే స్వయంగా వీవడియో విడుదల చేసింది పూనమ్. దీంతో అందరూ ఆమె మీద మండిపడ్డారు. ఏంటీ స్టంట్లు..చనిపోయానని చెప్పడం ఏంటి అంటూ తిట్టిపోశారు అందరూ. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూనమ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు.

Also Read:Telangana : ఇల్లందులో టెన్షన్.. మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష

మేమే చేయించాం...

అయితే ఇప్పుడు తాజాగా పూనమ్ పోస్ట్‌కు తామే కారణమంటూ ముందుకు వచ్చిందో డిజిటల్ ఏజెన్సీ కంపెనీ. సర్వేకల్ క్యాన్సర్‌ మీద అవగాహన కల్పించడం కోసమే తాము పూనమ్ చేత అలా చేయించామని చెబుతోంది స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ. మమ్మల్ని క్షమించండి అంటూ ప్రకటనను కూడా విడుదల చేవారు. క్యాన్సర్ అవగాహన కోసమే అలా చేశాం తప్ప పబ్లిసిటీ స్టంట్ కాదని వివరణ ఇచ్చారు స్కబాంగ్ టీమ్.

2022లో ఇండియాలో 1,23,907 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 77,348 మరణించారు. పూనమ్ త్లలి కూడా సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించారు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కోన్న విషాదమే ఆమె ఈ రకంగా పోస్ట్ చేయడానికి కారణం అయింది. అందుకే మేము కూడా ఇందులో భాగస్వామ్యులం అయ్యాము. నిజానికి పూనమ్ పోస్ట్ వల్ల అత్యధికలు ఆన్‌లైన్‌లో సర్వైకల్ క్యాన్సర్ గురించి వెతికారు...చదివి తెలుసుకున్నారు అని చెబుతోంది స్కబాంగ్ డిజిటల్ ఏజెన్సీ.

పోస్ట్ మీద పూనమ్ వివరణ..

పూనమ్ బ్రతికే ఉంది. చనిపోలేదు.. స్వయంగా ఆమె తన సోషల్ మీడియా(Social Media) లో ఒక పోస్ట్ పెట్టింది. నేను సర్వైకల్ కాన్సర్ తో చనిపోయానని వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అలా ఎందుకు చేసామంటే.. చాలామంది మహిళలు ఈ రకమైన కాన్సర్ తో బాధపడుతూ చనిపోతున్నారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వారికి ఈ జబ్బుపై సరైన అవగాహనా లేదు. వారికి అవగాహనా కల్పించడానికే ఇలా చేశాను. ఈ డిసీస్ ఉన్న వారు అంట త్వరగా ఏం చనిపోరు. దానికి కూడా వ్యాక్సిన్ ఉంది. కానీ అది ఉన్నట్లు కూడా చాలా మంది మహిళలకు తెలియదు. వారికి అవగాహనా కల్పించడంకోసమే ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పూనమ్ ఇలా చేసినందుకు, సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అమె కనుక చనిపోకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు