OTT New Release: చప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త కామెడీ సినిమా.. 

అల్లరి నరేశ్ హీరోగా, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 

New Update
OTT New Release: చప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త కామెడీ సినిమా.. 

OTT New Release: ఈమధ్య సినిమాలు ఓటీటీలోకి చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్ రన్ పూర్తికాకుండా కూడా సైలెన్స్ గా ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతున్నాయి. దాదాపుగా ప్రతివారం ఒక కొత్త సినిమా ఓటీటీలోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఇదిగో ఇప్పుడు కూడా ఒక కొత్త కామెడీ సినిమా ఓటీటీలోకి దూసుకువచ్చేసింది. 

Aa okkati Adakku

OTT New Release: అల్లరి నరేష్ అంటేనే కామెడీకి కేరాఫ్ ఎడ్రస్. ఇటీవల నరేష్ హీరోగా చేసిన ఆ ఒక్కటి అడక్కు.. డీసెంట్ కామెడీ ఫిల్మ్ గా థియేటర్లలో సందడి చేసింది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎబౌ ఏవరేజ్ గా నిలిచింది. చాలాకాలంగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ కు బ్రేక్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు అనే స్థాయిలో ఈ సినిమా పేరు తెచ్చుకుంది. సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. హిట్ సినిమా టైటిల్ కావడం.. అదీ ఈవీవీ సినిమా టైటిల్ అవడం.. అందులో అల్లరి నరేశ్ హీరో కావడంతో సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే, ఆ రేంజ్ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. 

aa okkati adakku

Also Read: సినీ ప్రేమికులకు పండగ రోజు.. మల్టీప్లెక్స్ ల్లో 99 రూపాయలకే సినిమా! 

OTT New Release: ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎటువంటి సమాచారం.. హంగామా లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రీమియర్ అవుతోంది. సినిమా విడుదల పై ఎటువంటి సమాచారం లేకుండానే చప్పుడు కాకుండా స్ట్రీమింగ్ కి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా ఓటీటీలో చేరువ అవుతుందని భావిస్తున్నారు. మరి ఆ ఒక్కటీ అడక్కు సినిమాకు ఓటీటీలో ఎలాంటి బజ్ వస్తుందో చూడాలి. 

aa okkati adakku

చిలక ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రాజీవ్ చిలక తెరకెక్కించిన ఈ మూవీలో జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా చేసింది. ఇక వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ త‌దిత‌రులు సినిమాలో సందడి చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment