OPS vs OPS vs OPS vs OPS vs OPS.. మొత్తం ఐదుగురు 'పన్నీర్‌సెల్వం'లు ఒక చోట నుంచే పోటి! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు 'పన్నీర్‌సెల్వం'లు రామనాథపురం లోక్‌సభ అభ్యర్థులగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ఇక్కడ నుంచి పోటీకి దిగుతుండగా.. ఆయన పేరుతోనే ఉన్న మరో నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటి చేస్తున్నారు. By Trinath 29 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Panneerselvam: మనుషులను పోలి మనుషులు ఏడుగురు ఉంటారో లేదో తెలియదు కానీ మనుషుల పేర్లు మాత్రం మ్యాచ్ అవుతాయి. ఒకటే పేరు చాలామందికి ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో పార్టీల గుర్తులు ఒకేలాగా ఉండడం చూసి ఉంటాం. హెలికాఫ్టర్‌కు, ఫ్యాన్‌కు రెక్కలే ఉంటాయి. ఇలా గుర్తులు పోటి ఉండడం చాలా కాలంగా చూస్తూ వస్తున్నదే. అయితే తమిళనాడులోని ఓ నియోజకవర్గంలో మాత్రం గతంలో ఎన్నడూ చూడని ఎన్నికలు జరగుతున్నాయి. అది కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం పోటి చేయబోతున్న నియోజకవర్గం రామనాథపురం. అక్కడ మొత్తం ఐదుగురు పన్నీరుసెల్వంలు పోటి చేస్తున్నారు. View this post on Instagram A post shared by India Today (@indiatoday) అందరూ ఓపీఎస్‌లే: రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా తన పేరును పంచుకునే నలుగురు వ్యక్తులను కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎన్నికల సంఘం డేటా ప్రకారం, ఓచప్పన్ పన్నీర్‌సెల్వం ఒయ్యా తేవర్ పన్నీర్‌సెల్వం, ఓచా తేవర్ పన్నీర్‌సెల్వం, ఒయ్యారం పన్నీర్‌సెల్వం లాంటి వారు మాజీ ముఖ్యమంత్రి పేరును పోలి ఉన్నారు. అంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు పన్నీర్ సెల్వంలు తమిళనాడులో ఎన్నికల పోరులో ఉన్నారు. ఇది షాకింగ్ విషయమే కదా! వీరంతా ఎవరు? ఈ ఐదుగురు పన్నీర్ సెల్వంలలో అయ్యారాం పన్నీర్ సెల్వం రామనాథపురం జిల్లాకు చెందిన వారు. మిగిలిన ముగ్గురు పన్నీర్ సెల్వం తమిళనాడులోని మధురై జిల్లా వాసులు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత, చార్ పన్నీర్ సెల్వం మార్చి 26న నామినేషన్ దాఖలు చేశారు. థేని జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం, ఎన్నికల అధికారులు తనకు ఇష్టమైన గుర్తులుగా బకెట్, జాక్‌ఫ్రూట్, ద్రాక్షలను జాబితా చేశారు. ఈ చిహ్నాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అదే పేరుతో నలుగురు వ్యక్తులు ఏకకాలంలో నామినేషన్లు దాఖలు చేయడాన్ని కేవలం యాదృచ్ఛికంగా కొట్టిపారేయలేమని మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం మద్దతుదారులు ఆరోపించారు. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహం కావచ్చని ఆరోపించారు. గతంలో అన్నాడీఎంకే నుంచి ఓ పన్నీర్‌సెల్వం బహిష్కరణకు గురయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రామనాథపురంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో అధికార డీఎంకేకు అనుబంధంగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి కనీ కే. నవాస్, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన పి జయపెరుమాళ్ ఉన్నారు. ఇక తమిళనాడులో ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. Also Read: జనసేనకు బిగ్ షాక్.. ఎన్నికల ముందు గుడ్ బై చెప్పిన కీలక నేత! #tamilnadu #panneerselvam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి