Varun Tej: బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరితే కచ్చితంగా ప్రచారానికైనా వస్తాను

ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో సందడి చేశారు హీరో వరుణ్ తేజ్. పుల్వామా దాడికి సంబంధించిన అంశాలను, దేశ భక్తిని ఈ చిత్రంలో పొందుపరిచినట్లు తెలిపారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరితే కచ్చితంగా ప్రచారానికైనా వస్తానని అన్నారు.

New Update
Varun Tej:  బాబాయ్ పవన్ కళ్యాణ్ కోరితే కచ్చితంగా ప్రచారానికైనా వస్తాను

Varun Tej: ఆపరేషన్ వాలంటైన్ చిత్రం (Operation Valentine) ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో (Vijayawada) సందడి చేశారు హీరో వరుణ్ తేజ్. మార్చ్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ భాషాల్లో రానుంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..పుల్వామా దాడికి సంబంధించిన అంశాలను.. దేశ భక్తిని ఈ చిత్రంలో పొందుపరిచామని తెలిపారు. 2019 పిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్ లపై జరిగిన దాడి (Pulwama Attack) తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారంపై ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. ఫిబ్రవరి 14 వాలంటెన్స్ రోజున పుల్వామా దాడిలో గాయపడ్డా వారిని, మృతి చెందిన వారిని పరామర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Also Read: హీరో నిఖిల్ తండ్రయ్యాడు.. వారసుడొచ్చాడని సంబరపడుతున్న ఫ్యాన్స్!

ఈ చిత్రం కోసం ఎయిర్ ఫోర్స్ (Air Force) ఆఫీసర్స్ ని ఎన్డీఎ సిబ్బందిని కలిసి అనేక అంశాలను తెలుసుకోని వారి లైఫ్ స్టైల్ ని నిజజీవితానికి దగ్గరగా ఈ చిత్రం నిర్మించామని వెల్లడించారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ కోసం పైలెట్ ఆఫీసర్స్ ని కలిసి వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా బాడీ బిల్డింగ్ చేశానని చెప్పుకొచ్చారు. వారి రీయల్ లైఫ్ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో అదే విధంగా ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు హీరో వరుణ్ తేజ్ (Varun Tej).

Also Read: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

ఈ క్రమంలోనే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తన బాబాయ్ కోరితే కచ్చితంగా ప్రచారానికైనా వస్తానని పేర్కొన్నారు. ఇలాంటి దేశభక్తి గలిగిన చిత్రాల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కంచె చిత్రం తరువాత అంతటి దేశ భక్తి ఉన్న పూర్తి కథ చిత్రం ఆపరేషన్ వాలంటైన్ అని కామెంట్స్ చేశారు. పుల్వామా దాడిలో మరణించిన కుటుంబ సభ్యులకు ఎంతోకొంత ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు