Online Medicine: ఆన్ లైన్ మెడిసిన్స్ పై కేంద్రానికి కోర్ట్ హెచ్చరిక ఎందుకంటే.. 

ఆన్లైన్ లో మెడిసిన్స్ అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పాలసీలను వెంటనే రూపొందించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని మరింత కాలం సాగదీయవద్దనీ.. ఒకవేళ పాలసీ తయారు చేయడంలో విఫలం అయితే చర్యలు తప్పవని హెచ్చరించింది కోర్టు 

New Update
Online Medicine: ఆన్ లైన్ మెడిసిన్స్ పై కేంద్రానికి కోర్ట్ హెచ్చరిక ఎందుకంటే.. 

Online Medicine:  మందుల విక్రయాలకు ఎనిమిది వారాల్లోగా పాలసీని రూపొందించాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు ఐదేళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. అందువల్ల ఈ విషయంలో ఒక విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు కోర్టు చెప్పింది. 

ఈ ఉత్తర్వులను పాటించకపోతే తదుపరి విచారణకు జాయింట్ సెక్రటరీ హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఆన్లైన్ మందుల అమ్మకాలకు సంబంధించి 2018 ఆగస్టు 28న జారీ చేసిన నోటిఫికేషన్ ఇంకా సంప్రదింపుల దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కీర్తిమాన్ సింగ్ తెలిపారు.

ఆన్లైన్లో అక్రమంగా మందుల అమ్మకాలను(Online Medicine) నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై  విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని బార్ అండ్ బెంచ్ తెలిపింది. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ రూల్స్ మరింత సవరించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించిన ముసాయిదాను కూడా ఈ పిటిషన్లు సవాలు చేశాయి.

Also Read: ఆర్బీఐ కొత్త రూల్.. ఇక క్రెడిట్ కార్డ్.. పర్సనల్ లోన్ సరదా తీర్చేస్తాయి..

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940, ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం ఆన్ లైన్ లో మందుల అమ్మకాలను నిషేధిస్తూ 2018 డిసెంబర్ లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైంది. ఆన్ లైన్ లో మందుల విక్రయాలు కొనసాగిస్తున్న ఈ-ఫార్మసీలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ కోరింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తప్పు చేసిన ఈ-ఫార్మసీపై చర్యలు తీసుకోనందుకు కేంద్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు