వినియోగదారులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి, టమాటా ధరలు..రోజురోజుకి పైకి! గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుంటే..అదే బాటలోకి టమాటా కూడా వచ్చి చేరుతుంది. ఉల్లి మాత్రమే వినియోగదారులను ఏడిపిస్తుందనుకుంటే ఇప్పుడు టమాటా కూడా వచ్చి చేరింది. By Bhavana 31 Oct 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టమాటా ధరలు చుక్కల్లోకి ఎక్కడంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు. ఏకంగా ఒక్కసారిగా టమాటా కేజీ 200 రూపాయలు కూడా చేరుకున్నాయి. దీంతో ప్రజలు కొనడం కూడా మానేయడంతో ..ప్రభుత్వమే సబ్సిడీ కింద టమాటాలను ఇచ్చాయి. కొంతకాలం తరువాత టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. తాజాగా ఇప్పుడు ఉల్లి ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కోసినప్పుడే కాకుండా..కొనేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉల్లి ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరేలోపే మళ్లీ టమాటా ధరలు మరోసారి నేను ఉన్నాన్నంటూ ముందుకు వస్తుంది. Also read: నగరంలో 24 గంటలు మంజీరా వాటర్ బంద్..ఎప్పుడంటే! ఒక్కసారిగా మార్కెట్ లో ఉల్లి, టమాటా ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి రూ. 60 కి చేరుకుంటే.. కేజీ టమాటా రూ. 40 కి పెరిగింది. కొన్ని చోట్ల ఉల్లి ధరలు రూ. 80 కి అమ్ముతున్నారు. టమాటాని రూ.50 కి విక్రయిస్తున్నారు. మరికొన్ని రోజులు ఆగితే ఉల్లి ధరలు సెంచరీ దాటతాయని అర్థం అవుతుంది. దీంతో వినియోగదారులు ప్రస్తుతం మార్కెట్లో కొనేటట్లు లేదు..తినేటట్లు లేదు అంటూ వాటి వైపు ఓ కన్ను కూడా వేయకుండానే వెళ్లిపోతున్నారు.వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు సరిగా పడకపోవడం వల్ల సకాలంలో చేతికి అందాల్సిన పంట అందకపోవడంతో దిగుబడులు రాలేదు. Also read: ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం! దీంతో ఒక్కసారిగా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి పంట సరిగా పండలేదు. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. టమాటా మార్కెట్ కు పెట్టింది పేరు అయిన మదనపల్లె మార్కెట్ కు గత 10 రోజుల నుంచి టమాటా పంటే రావడం లేదు. ఈ ఏడాది జూన్ జులై నెలల్లో టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఆ తరువాత మెల్లగా ధరలు పడిపోయాయి. కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో రోడ్డు పై పారబోసి నిరసన కూడా తెలిపారు. తాజాగా మరోసారి టమాటా ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి. Also read: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్…3,220 పోస్టులకు నోటిఫికేషన్! #market #prices #onions #tamata మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి