Andhra Pradesh: అమ్మబాబోయ్.. వీళ్లు లేడీస్ కాదు.. పక్కా కిలాడీస్.. స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు..

ఆ బ్యూటీ పార్లర్ నిర్వహకురాలి కదలికపై నిఘా పెట్టారు. భాను అనే మహిళ రజియా వద్ద భారీ ఎత్తున బంగారం, నగదు ఉన్నట్లు ముగ్గురు లేడీ దొంగలకు సమాచారం అందించింది. ఇంకేముంది.. ఎలాగైనా చోరీ చేయాలని డిసైడ్ అయిన ఈ ముగ్గురు.. ఫేషియల్ చేయించుకుంటామనే నెపంతో పార్లర్‌కు వెళ్లారు.

New Update
Andhra Pradesh: అమ్మబాబోయ్.. వీళ్లు లేడీస్ కాదు.. పక్కా కిలాడీస్.. స్టోరీ తెలిస్తే అవాక్కవుతారు..

Ongole Robbery Case: వీరంతా పైకి బుద్దిమంతుల్లా ఉంటారు. అమాయకత్వానికే అమ్మమ్మల్లా కనిపిస్తారు. కానీ, వారి అసలు నిజ స్వరూపం తెలిస్తే మాత్రం కళ్లు తేలేస్తారు. ఫేషియల్ చేయించుకుంటామంటూ వచ్చున ముగ్గురు కిలాడీలు.. ఆ షాపు యజమాని ఒంటిపై ఉన్న బంగారం, డబ్బులంతా ఎత్తుకెళ్లారు. తాజాగా కిలాడీలను పట్టుకున్న పోలీసులు.. వీరి నేర చరిత్రకు సంబంధించిన వివరాలనువెల్లడించారు.

ఈ లేడీ కిలాడీలను మీడియా ముందు ప్రవేశపెట్టిన ప్రకాశం(Prakasham) జిల్లా ఎస్పీ మలిక గార్గ్.. వీరి నేర చరిత, తాజాగా జరిగిన దోపిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. షేక్ రజియా ఒంగోలు(Ongole)లోని శ్రీకృష్ణ నగర్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. అయితే, పక్కా చోర్‌లు అయిన వీరు.. ఆ బ్యూటీ పార్లర్ నిర్వహకురాలి కదలికపై నిఘా పెట్టారు. భాను అనే మహిళ రజియా వద్ద భారీ ఎత్తున బంగారం, నగదు ఉన్నట్లు ముగ్గురు లేడీ దొంగలకు సమాచారం అందించాడు. ఇంకేముంది.. ఎలాగైనా చోరీ చేయాలని డిసైడ్ అయిన ఈ ముగ్గురు.. ఫేషియల్ చేయించుకుంటామనే నెపంతో పార్లర్‌కు వెళ్లారు. అలా వెళ్లడం వెళ్లడంతోనే బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు రజియాపై మత్తు మందు చల్లారు. ఆమె స్పృహ కోల్పోగానే.. ఒంటిపై ఉన్న బంగారం, షాప్‌లో ఉన్న నగదు మొత్తం దోచుకెళ్లారు. మత్తు దిగాక.. లేచి చూసుకున్న రజియా.. జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలా పట్టుకున్నారు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. ముందుగా వీరి చోరీకి సహకరించిన భానును పట్టుకున్నారు పోలీసులు. ఆమె ఇచ్చిన సమాచారంతో ముగ్గురు మహిళలు ముండ్రు లక్ష్మి నవత అలియాస్ నవ్య, కరణం మోహన దీప్తి అలియాస్ దీప్తి, అలహరి అపర్ణ లను అరెస్ట్ చేశారు ఒంగోలు పోలీసులు. ఈ ముగ్గురే చోరీకి పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు.. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ వీరిలో ఇద్దరు మహిళలు పెళ్లూరు, దోనకొండ, పొదిలిలో ఇలాంటి దొంగతనాలకే పాల్పడినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిందితులు మొత్తంగా 100 గ్రాముల బంగారం, రూ. 40 వేల నగదు దోచుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దోచుకున్న సొత్తులో 96 గ్రాముల బంగారం, రూ. 40 డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసుకు సంబంధం ఉన్న మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని ఎస్పీ మల్లిక గర్గ్ తెలిపారు. ఇదే సమయంలో కేసును త్వరగా చేధించిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.

Also Read:

Watch Video: వేప పుల్లతో ‘ఇండియా-భారత్’ వ్యత్యాసాన్ని వివరించిన లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న అలనాటి వీడియో..

Bonda Uma: చంద్రబాబుకు ఐటీ నోటీసుల వెనుక సీఎం జగన్ హస్తం.. బోండా ఉమ ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు