/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వార్మ్ రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో 31న, ఏపీలోని కోస్తాంధ్ర, యానాంలో 29 నుంచి 31 మధ్య కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తీరా ప్రాంతాల్లో తుఫాన్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు ఉండనున్నట్లు పేర్కొంది.
తిరుపతిలో ఒకవైపు ఎండలు మండుతూ .. వర్షాలు పడుతున్నాయి. ఊసరవెల్లిల మారుతున్న వాతావరణంతో తిరుమలకు వచ్చే భక్తులతో పాటు అక్కడ నివసించే వారి ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండనుంది.
విజవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
సముద్ర తీరానికి అనుకోని ఉండే విశాఖ నగరంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 32డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.