BCCI: మరోసారి బీసీసీఐకి కాసుల వర్షం..

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్‌ను అడిడాస్‌ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్‌ తాజా ప్రకటన విడుదల చేసింది.

New Update
Team India: వచ్చే నెల రోజులు భారత్ క్రికెట్ అభిమానులకు కిక్కే కిక్కు

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. భారత జట్టు జర్సీ స్పాన్సర్‌ను అడిడాస్‌ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు అడిడాస్‌ తాజా ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. కానీ ఈ ఐదేళ్ల ఒప్పందం విలువ 1250 కోట్లకు పైనే ఉంటుందని పలువురు క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అడిడాస్‌ సంస్థ ఈ ఏడాది నుంచి 2028 వరకు టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. కాగా ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా జర్సీ స్పాన్సర్‌గా ఎంపీఎల్‌ ఉంది.

ఎంపీఎల్‌ సంస్థ ఒప్పదం ఈ ఏడాదితో ముగియనుంది. దీంతో బీసీసీఐ టీమ్ జెర్సీ కొత్త స్పాన్సర్ల కోసం ధరఖాస్తులను కోరగా స్పాన్సర్‌ హక్కుల కోసం అడిడాస్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు పోటీపడ్డాయి. కానీ చివరకు అడిడాస్‌ సంస్థ స్పాన్సర్‌ షిప్‌ హక్కులను దక్కించుకుంది. మరోవైపు ఎంపీఎల్‌ భారత క్రికెట్‌ టీమ్‌ స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న సమయంలో టీమ్‌ ఇండియా జెర్సీ స్పాన్సర్‌ను ఎంపీఎల్‌ నుంచి కిల్లర్‌ జీన్స్‌ దుస్తూల సంస్థ దక్కించుకుంది దాదాపు 9 నెలలుగా కిల్లర్‌ దుస్తూల సంస్ధ జర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం అడిడాస్‌ కో స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11 సైతం వ్యవహరించ నుంది.

మరోవైపు భారత జట్టు వరల్డ్‌ కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పాల్గొననుంది. ఈ సిరీస్‌లో బీసీసీఐ పలువురు సీనియర్‌ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రోహిత్‌కు బదులు కేఎల్ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరింబోతున్నాడు. కాగా మేటి బ్యాటర్లు, బౌలర్లు ఉన్న ఆసిస్‌ టీమ్‌తో టీమిండియా ఎలా రానిస్తుందనేది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది. ఈ సిరీస్‌లో భారత కీలక బౌలర్‌ బుమ్రా పాల్గొనడం లేదని తెలుస్తోంది అతనికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు