Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు - టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ

గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీ-సాట్ ద్వారా ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నామని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

New Update
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం ఏది?

On Line classes: గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను 750 ఎపిసోడ్లను సిద్ధం చేసినట్లు టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అనేక పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇది ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ప్రసారమయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అరగంట నిడివిగల పాఠ్యాంశాలను రోజుకు ఐదు గంటల చ్పొప్పున 10 ఎపిసోడ్స్ 75 రోజుల పాటు టీ-సాట్ నెట్ వర్క్ చానళ్లలో ప్రసారమవుతాయని సీఈవో వివరించారు.

టీ-సాట్ నిపుణ ఛానల్ లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అవే ప్రసారాలను మరుసటి రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు విద్య చానల్ ద్వారా ప్రసారం చేస్తామని వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం సుమారు 1200 గంటల అవగాహన పాఠ్యాంశాలను అందించి గ్రూప్-1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించేందుకు అభ్యర్థులకు టీ-సాట్ అండగా నిలిచిందని ఆయన తెలిపారు. మరో మూడు నెలల్లో జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సైతం అదే ప్రోత్సాహాన్ని టీ-సాట్ అందిస్తోందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో సూచించారు. లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండి టీ-సాట్ అందించే ప్రసారాల ద్వారా నిరుద్యోగ యువత మంచి ఫలితాలు సాధించవచ్చని సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Amazon Sale: ఈరోజు నుంచి గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ అమెజాన్ సేల్..

Advertisment
Advertisment
తాజా కథనాలు