ఆ విషయంలో పాక్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోంది... కార్తీ చిదంబరం ఫైర్...!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఎన్నికల్లో ప్రధాన ప్రతి పక్ష నేతను పోటీ చేయకుండా అడ్డుకోవడంలో పాకిస్తాన్ కూడా భారత్ మోడల్ ను అనుసరిస్తోందని విమర్శించారు. మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీపై పెట్టిన కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

New Update

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు షాక్ ఇచ్చింది. తోషాఖానా కేసులో ఆయన్ని కోర్టు దోషిగా ప్రకటించింది. ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం అందించారన్న కారణంగా ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు శిక్ష విధించనున్నట్టు చెప్పింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను జమాన్ పార్క్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. పాక్ లో నవంబర్‌లో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఆయన తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవించనున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఇది ఇలా వుంటే గతంలో కర్ణాకటలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎందుకు వుంటుందోనని ఆయన అన్నారు. దీనిపై గుజరాత్ కు చెందిన పూర్ణేశ్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ తన పదవి కోల్పోయారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు