Olympics 2024: వినేశ్ ఫోగాట్‌కు స్వల్ప ఊరట.. సిల్వర్ మెడల్ పై చిగురించిన ఆశలు! భారత క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ ఇది.. వినేశ్ ఫోగాట్ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంగీకరించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాలపై మళ్లీ ఆశలు చిగురించాయి. By Nikhil 08 Aug 2024 in స్పోర్ట్స్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి భారత క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ ఇది.. వినేశ్ ఫోగాట్ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంగీకరించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాలపై మళ్లీ ఆశలు చిగురించాయి. 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ డిస్ క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. 100 గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను ఫైనల్ ఆడనివ్వకుండా రూల్స్ అడ్డుపడ్డాయి. అయితే ఫైనల్ వరకు వినేశ్ ఫోగాట్ ఓవర్ వెయిట్ లేదు. రెజ్లింగ్‌లో సెమీస్ గెలిస్తే మెడల్ ఫిక్స్ అయినట్టే లెక్కా. కేవలం ఫైనల్‌కు మాత్రమే ఆమె ఉండాల్సినదాని కంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారు. మరి సెమీస్ గెలిచినందుకు మెడల్ ఇవ్వాలి కదా అని వినేశ్ కోర్టు తలుపుతట్టారు. 🚨The Court of Arbitration for Sports (CAS) has accepted Vinesh Phogat's appeal. She can still win Silver medal 🤞#Paris2024 #VineshPhogat #Wrestling #Olympics pic.twitter.com/68hAC2R12U — InsideSport (@InsideSportIND) August 8, 2024 వినేశ్ అప్పిల్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తాజాగా ఆమె అప్పీల్ ను స్వీకరించింది. రేపు ఇందుకు సంబంధించిన తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఫిక్స్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. Also Read : బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి