Ola Bumper Offer : ఓలా బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్..!!

ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ లో భాగంగా ఈవీపై ఏకంగా రూ. 25వేల భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ జనవరి 31వరకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

New Update
Electric Scooter: పండగలాంటి వార్త..భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర..కొత్త ధరలు తెలుస్తే కొనేస్తరు..!!

Republic Day Offer : గణతంత్ర దినోత్సవం ఆఫర్(Republic Day Offer) అదిరిపోయింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఫ్లానింగ్ లో ఉన్నవారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) తయారీదారు సంస్థగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా అదిరిపోయే డీల్ ను తీసుకువచ్చింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఇది కిర్రాక్ ఆఫర్ వర్తిస్తుందని చెప్పవచ్చు. ఓలా స్కూటర్(Ola Scooter) 75వ రిపబ్లిక్ డే ఆఫర్ ను తీసుకువచ్చింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్(Ola Unity Heritage Ride) పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది.

ఓలా(Ola) అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్(Bumper Offer) జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు ఎక్స్టెండెడ్ వారంటీపై 50శాతం డిస్కౌంట్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్(Exchange Bonus) కింద రూ. 2వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఓలా ఎస్ 1 ప్రో, ఎన్ 1 ఎయిర్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు కొనుగోలుదారులు సెలక్ట్ చేసిన క్రెడిట్ కార్డులపై రూ. 5వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ ట్రాన్సక్షన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే లోన్ తీసుకుంటే 7.99శాతం నుంచి వడ్డీ రేటు షురూ అవుతుంది.

ఇది కూడా చదవండి: ప్రతిరోజూ ఈ పండ్లు తినండి..శ్రీలీలను మించిన అందం మీ సొంతం..!!

ఇక అదనంగా ఎస్ 1 ఎక్స్ ప్లస్ మోడల్ రూ. 20వేల తగ్గింపుతో రూ. 89,999కే లభిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈమధ్యే ఐదు కొత్త మోడళ్లతో తన పోర్టో ఫొలియోను విస్తరించింది. ఓలా ఎస్ 1 ప్రో ధర రూ. 1,47,499గా ఉంది. ఎస్ 1 ఎయిర్ ధర రూ. 1,19,999గా ఉంది. ఎస్ 1ఎక్స్ మూడు వేరియంట్లలో ఉండగా..ఎస్ 1ఎక్స్ ప్లస్, ఎస్ 1 ఎక్స్ , ఎస్ 1ఎక్స్ అనేవి ఉన్నాయి. ఓలా ఎస్ 1 ఎక్స్ , ఎస్ 1 ఎక్స్ మోడళ్లను కేవలం రూ. 999తో బుక్ చేసుకోవచ్చు. వీటి ప్రారంభ ధర రూ. 99,999గా రూ. 89,999గా ఉంది.

మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లానింగ్ లో ఉంటే కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లను అందిపుచ్చుకోవచ్చు. ఈ డీల్స్ పరిమిత కాలం వరకు ఉంటాయి. ఆఫర్ ఉన్నప్పుడే మీకు నచ్చిన మోడల్ కొనుగోలు చేయడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు