Oman: ఒమన్ సముద్రతీరంలో మునిగిన ఓడ..13మంది భారతీయులు గల్లంతు

ఒమన్ సముద్రతీరంలో చమురు ఓడ మునిగిపోయింది. ఇందులో మొత్తం 16 మంది గల్లంతవ్వగా వారిలో 13మంది భారత సిబ్బంది ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్‌ ఫాల్కాన్‌గా గుర్తించారు.

New Update
Oman: ఒమన్ సముద్రతీరంలో మునిగిన ఓడ..13మంది భారతీయులు గల్లంతు

Ship Drowned: గల్ఫ్‌ లోని ఒమన్ సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొమొరాస్‌ చండా ఉన్న డ ఒకటి మునిగిపోయింది. ఇది ఒక ఆయిల్‌ను రవాణా చేస్తున్న షిష్ అని తెలుస్తోంది. ఈ ఘటనలో 16మంది గల్లంతు అయ్యారు. వారిలో 13మంది భారత సిబ్బంది ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్‌ ఫాల్కాన్‌ గా గుర్తించారు.

పోర్ట్ టౌన్ దుకమ్‌కు దగ్గరలోనిరాస్ మద్రాకు 25 నాటికల్ మైళ్ళ దూరంలో ఓడ మునిగిపోయిందని ఆదేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. అయితే ఆయిల్ ట్యాంకర్ మునిగిపోవడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఓడలో మొత్తం 16మంది సహాయక సిబ్బంది ఉన్నారు. ఇందులో ముగ్గురు శ్రీలంకకకు చెందిన వారు కాగా మిగతావారు భారతీయులు. వారి మృతదేహాలను బయటకు వెలికితీసందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఓడ మునిగిపోయి తలకిందులైనట్లు సమాచారం. అయితే సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకైన విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

Also Read:Andhra Pradesh: రాజధానితో నేషల్ హైవే అనుసంధానం

Advertisment
Advertisment
తాజా కథనాలు