Guntur Kaaram Song: శ్రీలీల ఫ్యాన్స్.. గుంటూరు కారంలో ఆ పాట ఉండే ఛాన్స్ కనబడటం లేదు!

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇటీవలే మూవీ నుంచి రిలీజైన 'ఓ మై బేబీ' పాట నెట్టింట్లో చర్చగా మారింది. పాట పై ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కారణంగా సినిమాలో పాటను తొలగించే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తోంది.

New Update
Guntur Kaaram Song: శ్రీలీల ఫ్యాన్స్.. గుంటూరు కారంలో ఆ పాట ఉండే ఛాన్స్ కనబడటం లేదు!

Oh My Baby Song: మాటల మాంత్రికుడు దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. 'సర్కారు వారి పాట' తర్వాత మహేష్ బాబు మాస్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.

publive-image

అయితే 'గుంటూరు కారం' (Guntur Kaaram) అనౌన్స్ చేసినప్పటి దీని గురించి సోషల్ మీడియాలో ఎదో ఒక చర్చ వినిపిస్తూనే ఉంది. షూటింగ్ మొదట్లో హీరోయిన్ గా అనుకున్న పూజ హెగ్డేను కొన్ని కారణాల వల్ల రీప్లేస్ చేశారు. దీనిపై కొంత కాలం పలు రకాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా పాటకు సంబంధించి నెట్టింట్లో మరో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్ 'దమ్ మసాలా' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కానీ ఇటీవలే విడుదలైన 'ఓ మై బేబీ' పాట పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ కంపోజిషన్ బాగాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అభిమానులు సాంగ్ బాగాలేదని పోలైట్ గా స్పందించగా.. మరి కొంతమంది మ్యూజిక్ కంపొజిషన్ లిరిక్స్ ఉద్దేశించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. "ధమ్ మాసాల సాంగ్ లిరిక్స్ చాలా బాగున్నాయని.. కానీ ఈ పాట లిరిక్స్ చాలా చెత్తగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు." థమన్ (Thaman) మ్యూజిక్ కూడా బాగాలేదంటూ చెబుతున్నారు. హీరో మహేష్ బాబుకు కూడా ఈ పాట నచ్చలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కారణాల చేత సినిమాలో 'ఓ మై బేబీ' పాటను తొలగించే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: Mangalavaram OTT Release: ఓటీటీలోకి మిస్టరీ త్రిల్లర్..’మంగళవారం’ స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు