OG Movie: ఓజీ వాయిదా.. పవన్ ఫ్యాన్స్‌కు షాక్

పవన్ గబ్బర్ సింగ్ సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ ఆనందంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, ఊహించని విధంగా ఓ చేదు వార్త తెరపైకొచ్చింది. అదేంటంటే.. ఈ ఏడాది పవన్ నుంచి ఇంకో సినిమా రావడం లేదు.

New Update
OG Movie: ఓజీ వాయిదా.. పవన్ ఫ్యాన్స్‌కు షాక్

OG Movie Postponed: పవన్ (Pawan Kalyan) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది గబ్బర్ సింగ్ మూవీ (Gabbar Singh Movie). ఈ సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ ఆనందంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, ఊహించని విధంగా ఓ చేదు వార్త తెరపైకొచ్చింది. అదేంటంటే.. ఈ ఏడాది పవన్ నుంచి ఇంకో సినిమా రావడం లేదు.

ఈ ఏడాది ఇప్పటికే బ్రో సినిమాను (Bro Movie) రిలీజ్ చేశాడు పవన్ కల్యాణ్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. బయ్యర్లు ఎవ్వరూ డబ్బులు చూడలేకపోయారు. ఒక్కరూ కూడా బ్రేక్ ఈవెన్ దాటలేకపోయారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యారు. వెంటనే తమ దృష్టిని ఓజీ సినిమాపై పెట్టారు.

సుజీత్ దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా (OG Movie) డిసెంబర్ లో థియేటర్లలోకి వస్తుంది కాబట్టి, అప్పటివరకు వెయిట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఓజీ సినిమా ఈ ఏడాది థియేటర్ లోకి రావడం లేదు.

Also Read: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది

Advertisment
Advertisment
తాజా కథనాలు