OnePlus : వన్ ప్లస్ కు షాకిచ్చిన రిటైల్ చైన్స్.. మే 1 నుంచి విక్రయాలు నిలిపివేత.!

వన్ ప్లస్ కు రిటైల్ చైన్స్ షాకిచ్చింది. ఆఫ్ లైన్ స్టోర్లలో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు రిటైలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. మే 1 నుంచి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ రాసిన లేఖలో పేర్కొంది. పూర్తివివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

New Update
OnePlus : వన్ ప్లస్ కు షాకిచ్చిన రిటైల్ చైన్స్.. మే 1 నుంచి విక్రయాలు నిలిపివేత.!

Retail : చైనా(China) కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్(OnePlus) కు రిటైల్స్ చైన్స్ షాక్ ఇచ్చాయి. వన్ ప్లస్(OnePlus) కు చెందిన స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తులను ఆఫ్ లైన్ స్టోర్ల(Off Line Stores) లో ఇకనుంచి విక్రయించమని ప్రకటించాయి. వన్ ప్లస్ విక్రయాల వల్ల తమకు పెద్దగా మార్జిన్లు ఉండటం లేదని పేర్కొన్నాయి. కొన్ని ఇతర సమస్యలనూ వన్ ప్లస్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఆఫ్ లైన్ మార్కెట్లో మే 1 నుంచి విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించాయి.

ఆన్ లైన్ విక్రయాల నిలిపివేతపై సేల్స్ డైరెక్టర్ రంజిత్ సింగ్ కు సౌత్ ఇండియన్ ఆర్జనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్(South Indian Organized Retailers Association) తాజాగా లేఖ రాసినట్లు మనీకంట్రోల్ వెబ్ సైట్లో పేర్కొంది. ఈ అసోసియేషన్ లో పూర్విక, సంగీత, బిగ్ సి వంటి రిటైల్ చైన్స్ సభ్యులుగా ఉన్నాయి. వన్ ప్లస్ ప్రొడక్టుల విక్రయంలో తాము ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ వన్ ప్లస్ కు రాసిన లేఖలో పేర్కొంది. మార్జిన్లు తక్కువగా ఉంటున్నాయని వారెంటీ, సర్వీస్ ప్రాసెసింగ్ ప్రక్రియను వన్ ప్లస్ ఆలస్యం చేస్తుందని ప్రస్తావించింది. దీంతో కస్టమర్లు అసంత్రుప్తిగా వ్యక్తం చేస్తున్నారని కొన్నిసార్లు తిరిగి తమపైనే భారం పడుతుందని లేఖలో తెలిపింది.

కాగా ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించినప్పటికీ వన్ ప్లస్ పట్టించుకోలేదని లేఖలో పేర్కొంది. ఈ కారణంతోనే మే 1 నుంచి వన్ ప్లస్ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లో ఉన్న 4,500రిటైల్ స్టోర్లలో అమ్మకాలు నిలిచిపోయే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై వన్ ప్లస్ ఇంకా స్పందించలేదు.

ఇది కూడా చదవండి: మోదీ హ్యాట్రిక్ కొట్టాలని కాళీదేవీ ముందు వేలు కత్తిరించుకున్న వీరాభిమాని..!

Advertisment
Advertisment
తాజా కథనాలు