Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 పోస్టులకు నోటిఫికేషన్ పడింది. ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు. వివరాలు కింద చదవండి. By Manogna alamuru 07 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PNB SO Recruitment 2024: వరుసపెట్టి బ్యాంకులన్నీ ఉద్యోగాలను ప్రటిస్తున్నాయి. మొన్నయూనియన్ బ్యాంక్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేస్తే ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ జాబ్ ఆఫర్స్‌ను ప్రకటించింది. బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్ధులు ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చను. https://www.pnbindia.in/Recruitments.aspx లింక్‌లో దరఖాస్తులను అప్ లోడ్ చేయాలి. మార్చి లేదా ఏప్రిల్లో ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఉద్యోగాలు ఇవే... మొత్తం 1, 025 స్పెసల్ ఆఫీసర్ పోస్టులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆఫీసర్ -క్రెడిట్ (జేఎంబీ స్కేల్-1) కేటగిరీలో 1000 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.36,000- 63,840 వరకు జీతం ఇస్తారు. వీటితో పాటూ మేనేజర్ -ఫోరెక్స్ (ఎంఎంజీ స్కేల్ -II) 15 పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరీకి వేతనం రూ.48,170 - రూ.69,810 వరకూ ఇస్తారు. ఇక మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్ -II) ఉద్యోగాలు 5 ప్రకటించారు. వీరికి రూ.48,170 - 69,810 జీతం ఇస్తారు. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజే స్కేల్ -III) 5 పోస్టులు ఉండగా.. రూ. 63,840 - 78,230 వరకు వేతనం చెల్లిస్తారు. జీతంతో పాటూ ఇతర సౌకర్యాలు అదనంగా ఉంటాయని చెబుతున్నారు. వయసు, విద్యార్హతలు... ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు జనవరి 1, 2024 నాటికి 21-28 ఏళ్ళు మించరాదు. మేనేజర్ పోస్టులకైతే 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి వయసు సడలింపు ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కు అప్లే చేయాలంటే సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ /బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, విద్యార్హతతో పాటూ ఇంతుకు ముందు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా బాండ్ కూడా రాయాలి. ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ అయితే 59 రూ...మిగతా అభ్యర్ధులు 1180 రూ. ఫీజు కట్టాలి. మొదట ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి. వీటన్నింటిలోనూ పాసయితేనే ఉద్యోగం ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌లలో నిర్వహిస్తారు. Also Read:PM Modi:రాజ్యసభలో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డ ప్రధాని..ఖర్గేకు మోదీ చురకలు #punjab-national-bank #officer-posts #pnb-recruitment-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి