Odisha Fire Accident: జగన్నాధుని చందన యాత్రలో అపశ్రుతి.. 15 మందికి తీవ్ర గాయాలు 

ఒడిశాలోని పూరీ జగన్నాథుని చందన యాత్ర ఉత్సవాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు అంతా గుమిగూడిన చోట బాణాసంచా పేలడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. 

New Update
AP Crime : ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య!

Odisha Fire Accident: ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలడంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సందర్భంగా కొందరు భక్తులు బాణాసంచా పేలుస్తుండగా నిప్పురవ్వ పడి పేలుడు సంభవించింది. మంటలు చెలరేగుతున్న బాణాసంచా ఘటనా స్థలంలో గుమికూడి ఉన్న వారిపై పడిందని, కొందరు తమను తాము రక్షించుకునేందుకు రిజర్వాయర్‌లోకి దూకారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించామని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి డాక్టర్ తెలిపారు.

నవీన్ పట్నాయక్ విచారం..
Odisha Fire Accident: ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు.  గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరిస్తామని తెలిపారు. పూరీ నరేంద్ర పూల్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి వినడం బాధాకరమని సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని, ఏర్పాట్లను పర్యవేక్షించాలని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Odisha Fire Accident: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, 'పూరీ చందన్ యాత్ర సందర్భంగా నరేంద్ర పుష్కరిణి దేవి ఘాట్ వద్ద జరిగిన దురదృష్టకర ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారనే వార్త విని బాధపడ్డాను. భగవంతుని ఆశీస్సులతో గాయపడిన వారు త్వరగా చికిత్స పొంది ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు. 

Also Read: దారుణం.. పాడైన కిడ్నీ బదులు మరో కిడ్నీ తీసేశాడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు