World cup 2023: వరల్డ్‌ కప్‌ అంటే ఈ ఆటగాడికి పూనకాలు పక్కా భయ్యా.. ఆ లెక్కలు చూస్తే షాక్‌ అవుతారు!

మరో రెండు రోజుల్లో క్రికెట్ ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా అభిమానులు వరల్డ్‌కప్‌ స్టాట్స్‌పై చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ క్రియేట్ చేసిన రికార్డులు ఈసారి బ్రేక్‌ అవుతాయా లేదా అన్నదానిపై ట్వీట్లు పెడుతున్నారు. ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు, అత్యధిక 100లు, అత్యధిక 50లు, అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డులు సచిన్‌ పేరిట ఉన్నాయి.

New Update
World cup 2023: వరల్డ్‌ కప్‌ అంటే ఈ ఆటగాడికి పూనకాలు పక్కా భయ్యా.. ఆ లెక్కలు చూస్తే షాక్‌ అవుతారు!

Sachin Tendulkar To Zaheer Khan team India Top Performers: వరల్డ్‌కప్(world cup) 2023) అంటే ప్రాణం పెట్టి ఆడే ఆటగాళ్లు ఉంటారు. అందులో క్రికెట్ గాడ్ సచిన్‌ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉంటాడు. మిగిలిన టోర్నమెంట్లలో కూడా సచిన్‌కి సాటి లేనప్పటికీ ప్రపంచ కప్‌ అంటే మాత్రం సచిన్‌లో మరో యాంగిల్‌ కనిపిస్తుంది. 2007 ప్రపంచ కప్‌ మినహా దాదాపు ప్రతి వరల్డ్‌కప్‌లోనూ సచిన్‌ అద్భుతంగా రాణించాడు. టీమిండియాకు సింగిల్‌ హ్యాండ్‌తో విజయాలు అందించాడు. 2011 ప్రపంచకప్‌ను గెలుచుకోని తన కలను సాకారం చేసుకున్నాడు. అయితే ప్రపంచ కప్‌లో సచిన్ క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. సచిన్‌తో పాటు జహీర్‌ ఖాన్‌ సహా మరికొందరి రికార్డులు ఇప్పటివరకు చెక్కుచెదరలేదు. అలాంటి రికార్డులపై ఓసారి లుక్కేయండి.

➡ అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ (2278 మ్యాచ్‌లలో 45 పరుగులు)

➡ అత్యధిక వ్యక్తిగత స్కోరు: సౌరవ్ గంగూలీ (183 పరుగులు, 1999 వరల్డ్ కప్‌)

➡ అత్యధిక స్ట్రైక్ రేట్: కపిల్ దేవ్ ( 26 మ్యాచ్‌ల్లో 115 స్ట్రైక్ రేట్)

➡ అత్యధికం 100లు: రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ (6).

➡ అత్యధిక 50లు: సచిన్ టెండూల్కర్ (45 మ్యాచ్‌ల్లో 15)

➡ అత్యధిక సిక్సర్లు: సచిన్ టెండూల్కర్ (45 మ్యాచ్‌ల్లో 27)

➡ ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ (673) 2003 వన్డే ప్రపంచకప్‌లో 11 మ్యాచ్‌ల్లో సచిన్ చేసిన రన్స్‌)

➡ అత్యధిక వికెట్లు: జహీర్ ఖాన్ , జవగళ్ శ్రీనాథ్ (44)

➡ ఉత్తమ బౌలింగ్ గణాంకాలు: ఆశిష్ నెహ్రా (ఫిబ్రవరి 26, 2003న డర్బన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 23 రన్స్‌ ఇచ్చి 6 వికెట్లు )

➡ ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు: జహీర్ ఖాన్ (21) వన్డే ప్రపంచకప్‌ 2011.

➡ అత్యధిక డిస్మిసల్స్: ఎంఎస్ ధోనీ (42) 29 మ్యాచ్‌ల్లో

➡ అత్యధిక క్యాచ్ లు: అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ(14)

➡ అత్యధిక భాగస్వామ్యం: సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ (318 పరుగులు) 1999 వరల్డ్‌ కప్‌.. శ్రీలంకపై

➡ అత్యధిక మ్యాచ్‌లు: సచిన్ టెండూల్కర్ (45)

➡ కెప్టెన్ గా అత్యధిక మ్యాచ్ లు: మహ్మద్ అజారుద్దీన్ (23)

➡ అత్యధిక స్కోరు: 413 మార్చి 5న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్ లో .. 2007 వరల్డ్ కప్‌.

➡ హ్యాట్రిక్: 1987 ప్రపంచ కప్‌లో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై చేతన్ శర్ హ్యాట్రిక్‌. జూన్ 2019లో సౌతాంప్టన్ లో అఫ్గానిస్థాన్‌పై మహ్మద్ షమీ హ్యాట్రిక్‌.

ALSO READ: ఈ మాత్రం దానికి వార్మప్‌ మ్యాచ్‌లు ఎందుకు? మరో గేమ్‌ కూడా ఫసక్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు