Winter diet: చలికాలం ఏం తినాలి!.. న్యూట్రిషన్లు ఏం చెప్తున్నారు?

వణికించే చలికాలంలో జిహ్వచాపల్యాన్ని అధిగమించడం ఆహార ప్రియులకు దాదాపు అసాధ్యం. కానీ, జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. శీతాకాలం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

New Update
Winter diet: చలికాలం ఏం తినాలి!.. న్యూట్రిషన్లు ఏం చెప్తున్నారు?

Winter diet: కొవ్వు పదార్థాలు, బాగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం సాధారణంగా చలికాలంలో రోజూ చేసేదే. జీవనశైలి లోపాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయానికి కారణమై వింటర్‎లో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అయితే, చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు న్యూట్రిషన్లు ఏం చెప్తున్నారో చూడండి..

స్వీట్లను ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిదంటున్నారు. ఇది ప్రాసెస్డ్ షుగర్ వినియోగాన్నే కాకుండా, హైడ్రోజనేటెడ్ ఆయిల్ వంటి హానికరమైన పదార్థాల వాడకాన్ని తగ్గిస్తుంది.

ప్రాసెస్డ్ షుగర్‎కు బదులు ఇవి వాడండి
ప్రాసెస్డ్ షుగర్ స్థానంలో తాజా పండ్ల గుజ్జు, ఖర్జూరం, అత్తి పళ్లు, తేనె లేదా బెల్లం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. చిటికెడు దాల్చినచెక్క, ఏలకులు, కుంకుమపువ్వు లేదా జాజికాయతో వంటలను రుచికరం చేసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
మైదా వాడకాన్ని తగ్గించి గోధుమ పిండి లేదా వేరే మిల్లెట్ పిండిని వినియోగించండి. ఇది ఫైబర్‌తో పాటు ఆహారంలో అదనపు విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తుంది.

ఇది కూడా చదవండి: మసాలాలు తింటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!

గింజ ధాన్యాలు
బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వుల వంటి గింజల ద్వారా ఆహారంలో పోషక విలువలు పెంచుకోవచ్చు. వీటితో ప్రోటీన్లు, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మోతాదులో వస్తాయి.

ప్లేటును రంగురంగుల పండ్లతో నింపండి
స్వీట్లు, వేయించిన స్నాక్స్‌కు బదులు యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ వంటి తాజా పండ్లతో కూడిన ప్లేటును అతిథులకు అందించండి. అది రుచితో పాటు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.

హెల్తీ స్నాక్స్‌ను దగ్గర పెట్టుకోండి
కాల్చిన చన్నా, వేరుశెనగలు, పండ్లు, లేత కొబ్బరి, కాయలు, చిక్కి, మఖానా, పెరుగు వంటి హెల్తీ స్నాక్ ను అందుబాటులో ఉంచుకోండి. వీటిని ప్రత్యేకంగా వంట చేయవలసిన అవసరం లేదు, రోజంతా శక్తినిస్తాయి.

మితాహారమే ఆరోగ్యకరం
విందుల్లో పాల్గొనండి గానీ మితంగానే ఆహారం తీసుకోండి. అందరితో సంతోషాన్ని పంచుకోండి. సమతౌల్య ఆహార విధానమే మనకు శ్రీరామరక్ష.

Advertisment
Advertisment
తాజా కథనాలు