NTR: తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్

బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా మేకర్స్ మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తమ్ముడు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

New Update
NTR: తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్

NTR: నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానుల ఎదురుచూపులు శుభం కార్డు పడింది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తొలి సినిమాను అనౌన్స్ చేశారు. #SimbaisComing అంటూ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ జీన్స్‌ అండ్ బ్లాక్ హుడీ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నందమూరి అభిమానులు విషెష్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు

నందమూరి హీరో ఎన్టీఆర్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. "సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు. జీవితంలో నీ ఈ కొత్త అధ్యయనానికి తాత గారి దీవెనలతో పాటు దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు అంటూ తారక్ ట్వీట్ చేశారు. " మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. మోక్షజ్ఞ అక్క తేజస్వి సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

#ntr
Advertisment
Advertisment
తాజా కథనాలు