Jr NTR : ముంబై లో ఎన్టీఆర్.. భార్యతో కలిసి డిన్నర్ పార్టీ.. సందడి చేసిన హృతిక్, రణ్ బీర్, ఆలియా!

తాజాగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి ముంబై బాంద్రా లోని ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాడు. ఈ డిన్నర్ పార్టీలో తారక్ తో పాటూ హృతిక్ రోషన్, రన్బీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్ సైతం అటెండ్ అయ్యారు.

New Update
Jr NTR : ముంబై లో ఎన్టీఆర్.. భార్యతో కలిసి డిన్నర్ పార్టీ.. సందడి చేసిన హృతిక్, రణ్ బీర్, ఆలియా!

Jr NTR Dinner Party In Mumbai : జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ప్రస్తుతం ముంబై(Mumbai) లో ఉన్నారు. ఇటీవలే 'వార్ 2'(War 2) షూటింగ్ కోసం వెళ్లారు. ఆ మధ్య ఓ షెడ్యూల్ కోసం సింగిల్ గా ముంబై వెళ్లిన తారక్.. ఇప్పుడు ఫ్యామిలీతో అక్కడ సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి(Lakshmi Pranathi) తో కలిసి ముంబై బాంద్రా లోని ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాడు.

ఈ డిన్నర్ పార్టీలో తారక్ తో పాటూ హృతిక్ రోషన్, రన్బీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్ సైతం అటెండ్ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో రెస్టారెంట్ కి వచ్చాడని తెలిసి ఫొటోగ్రాఫర్లు, అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

publive-image

Also Read : పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?

లేడీ ఫ్యాన్ కి ఎన్టీఆర్ గిఫ్ట్

ఎన్టీఆర్ డిన్నర్ చేసి బయటకు వస్తున్న క్రమంలో ఫొటోగ్రాఫర్లు, అభిమానులు తెగ గోల చేసారు. ఈ క్రమంలోనే ఓ లేడీ ఫ్యాన్ ఈ రోజు తన బర్త్ డే అని, ఒక్క సెల్ఫీ ఇవ్వాలని కోరగా.. ఎన్టీఆర్ ఆమెని దగ్గరికి పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చాడు. దీంతో ఆ లేడీ ఫ్యాన్ చాలా హ్యాపీ అయింది. డిన్నర్ పార్టీ తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్, రన్బీర్, ఆలియా భట్ బయటికి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

publive-image

'వార్ 2' కోసం 60 రోజుల కాల్షీట్స్

జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సినిమా కోసం ఇప్పటికే తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేసిన తారక్.. 'వార్ 2' కోసం సుమారు 60 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇందులో సీక్రెట్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నట్లు టాక్. యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14 న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment