Devara Release : పవన్ ప్లేస్ లో ఎన్టీఆర్.. సెప్టెంబర్లోనే 'దేవర' సందడి!

'దేవర' మూవీ రిలీజ్ డేట్ మరోసారి మారినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయ్యిందని అంటున్నారు. అప్పుడు రావాల్సిన 'OG' మూవీ రిలీజ్ వాయిదా పడిందట.

New Update
Devara Release : పవన్ ప్లేస్ లో ఎన్టీఆర్.. సెప్టెంబర్లోనే 'దేవర' సందడి!

Devara Release Date : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమాని పలు అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అంతకంటే ముందుగానే థియేటర్స్ లో సందడి చేయనుందట.

పవన్ సినిమా వాయిదాతో 'దేవర' ముందుకి

'దేవర' మూవీ రిలీజ్ డేట్ మరోసారి మారినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాని ఓ రెండు వారాల ముందుకు జరిపి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'దేవర' రిలీజ్ కి రెండు వారాల ముందంటే పవన్ కళ్యాణ్ 'OG' రిలీజ్ రోజు అన్నమాట.

Also Read : ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

అంటే 'దేవర' అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయ్యిందని అంటున్నారు. అప్పుడు రావాల్సిన 'OG' మూవీ రిలీజ్ వాయిదా పడిందట. దాంతో ఆ ప్లేస్ లో 'దేవర' రిలీజ్ కానున్నట్లు న్యూస్ బయటికి రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ న్యూస్ విని ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇప్పటివరకు దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు