NTR Bharosa : ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పండుగ..పెనుమాకలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్!

ఏపీలో పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. పెనుమాకలో సీఎం చంద్రబాబునాయుడు తొలి పెన్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్లను అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లపల్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు 

New Update
NTR Bharosa : ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పండుగ..పెనుమాకలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్!

Andhra Pradesh : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని హామీ ఇవ్వడం… ఆ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన విషయం గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. ఈరోజు (జూలై 1) ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం పెనుమాకలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా తొలిపెన్షన్ అందించారు. పెనుమాకలో (Penumaka) నివాసం ఉంటున్న వృద్ధుడు బనావత్ నాయక్ కు మొదటి పెన్షన్ అందించారు చంద్రబాబు. ఆ తరువాత ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ ను అందచేశారు. 

సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మీరు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు.. 

పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇలా.. 

ఈరోజు (జులై 1) న ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను అందచేయడం ప్రారంభించారు.  ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) స్వయంగా పాల్గొన్నారు. ఆయనే స్వయంగా కొందరు లబ్దిదారులకు పెంచిన కొత్త పెన్షన్‌ ను అందచేశారు.  ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనేందుకు బాబు ఆయన ఉండవల్లి నివాసం నుంచి జులై 1 ఉదయం 05.45 గంటలకు బయలుదేరి 06.00 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. 

అక్కడ 06.20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు బాబే స్వయంగా వెళ్లి నేరుగా పింఛన్లు అందజేశారు. 

పెరిగిన పింఛన్లు ..ఎవరెవరికి ఎంతంతంటే…

ఏపీలో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు జులై 1 నుంచి పెరిగిన పెన్షన్ (Pensions) ను అందచేయడం ప్రారంభం అయింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పింఛన్లను ఎన్నికల సమయంలోని మూడు నెలలకు కూడా వర్తింపచేశారు.

– పెరిగిన పింఛనుతో ఏప్రిల్ 1 నుంచి రూ.4000 లబ్ధి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.3000 కలిపి మొత్తం రూ.7000 ను అందజేయనున్నారు
– వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి జులై నుంచి రూ.4000 పింఛను ను ప్రభుత్వం అందజేస్తుంది.

– దివ్యాంగులకు పింఛన్ రూ.3000 పెంచారు. కూటమి ప్రభుత్వం వారికి రూ.6000 పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

– తీవ్ర అనారోగ్యంతో దీర్ఘ కాలిక వ్యాధులు ఉండే వారికి ఇచ్చే పెన్షన్ ను రూ.5000 నుంచి రూ.15000 లకి కూటమి ప్రభుత్వం పెంచింది. మొత్తం 24318 మంది ఈ విభాగంలో పింఛను అందనుంది.

రాష్ట్రంలో పింఛన్ల పెంపు వల్ల కూటమి ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పింఛనుదారులకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.4,408 కోట్లను జులై 1 ఒక్కరోజున పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సైతం పెంచిన పింఛన్ ఇవ్వడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వం పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బాబు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి ఇకపై రూ.34 వేల కోట్లు కేవలం పెన్షన్లను అందించడం కోసమే ఖర్చు చేయనుందని అధికారులు సమాచారం.

Also Read : అమలులోకి దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. వివరాలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు