NTA: ఫిర్యాదులు నిజమని తేలితే మళ్ళీ పరీక్ష-ఎన్టీయే

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన పరీక్ష విషయంలో అభ్యర్ధులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. అవే కనుక నిజమని తేలితే మళ్ళీ CUET-UG ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పింది. జులై 15 నుంచి 19 మధ్య కాలంలో పరీక్ష ఉంటుందని తెలిపింది.

New Update
NTA: ఫిర్యాదులు నిజమని తేలితే మళ్ళీ పరీక్ష-ఎన్టీయే

ఎన్టీయే నిర్వహించే పరీక్షలన్నీ ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నాయి. నీట్, నెట్ వివాదాలు ముగిసాయి అనుకుంటే ఇప్పుడు కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో కూడా అభ్యర్ధులు ఫిర్యాదులు చేశారు. వీటిని ఎన్టీయే కూడా పరిగణనలోకి తీసుకుంది. అభ్యర్ధులు చేసిన ఫిర్యాదులు కనుక సరైనవేనని తేలితే మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది. పలు సాంకేతిక సమస్యలు, పరీక్షా సమయం కోల్పోవడం వంటి ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు యూజీ ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల చేసిన ఎన్‌టీఏ.. జులై 9 లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది.

మే 15 నుంచి 29వరకు ప్రధాన సిటీల్లో ఈ పరీక్షలు జరిగాయి. వీటికి దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది హాజరయ్యారు. వీటి మీదనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఇవి కూడా జూన్ 30లోపు వచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. వీటిపై నిపుణుల బృందం నిర్ణయం తీసుకుంటుందని, ఒకవేళ వారి ఫిర్యాదులు నిజమైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

Also Read:Mumbai: వరల్డ్‌కప్‌ విన్నర్స్‌కు అంబానీల ఘన సన్మానం

Advertisment
Advertisment
తాజా కథనాలు