West Bengal: వెస్ట్ బెంగాల్ లో NIA బృందం పై రాళ్ల దాడి చేసిన ప్రజలు! పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో NIA బృందంపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏజెన్సీ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్‌ఐఏ తెలిపింది .2022 లో జరిగిన బాంబు పేలుళ్లపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులను విచారించేందుకు NIA అక్కడికి వెళ్లాల్సివచ్చింది. By Durga Rao 06 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి NIA Team Attacked in West Bengal: భూపతినగర్ నివాసితులు బలై మైతి,మోనోబ్రత్ జానాతో సహా కొంతమంది స్థానిక TMC నాయకులను విచారణకు రావాలని కేంద్రదర్యాప్తు సంస్థ NIA సమన్లు జారీ చేసింది. అయితే వారు సమన్లను పట్టించుకోకపోవటంతో ఎన్‌ఐఏ బృందం శనివారం ఉదయం భూపతినగర్‌కు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుంది. వాహనంలో ఎక్కించుకుని తిరిగి వస్తుండగా గ్రామస్తులు కొందరు వాహనాన్ని ఆపి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే వీరిని విడుదల చేసేందుకు ఎన్‌ఐఏ అధికారులు నిరాకరించడంతో 100 మందికి పైగా ఉన్న బృందం వాహనంపై దాడి చేసి అద్దాలను పగులగొట్టింది. ఈ దాడిలో ఒక NIA అధికారికి స్వల్ప గాయాలైయాయి. అయితే, వారు అక్కడి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో డిసెంబర్ 3, 2022 న జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి గత నెలలో 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఎన్ఐఏ విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.అంతకుముందు వారు సమన్లకు హాజరు కానందున మార్చి 28న న్యూ టౌన్‌లోని ఎన్‌ఐఎ కార్యాలయంలో హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎనిమిది మందిని ఆదేశించింది. Also Read: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..! ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు బృందంపై దాడి జరగడం ఇది రెండోసారి. అంతకుముందు, సందేశ్‌ఖాలీలోని టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్ ఇంటిపై దాడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం వెళ్ళినప్పుడు, అక్కడ అతనిపై దాడి జరిగింది.కోట్లాది రూపాయల రేషన్ పంపిణీ కుంభకోణంలో జైలులో ఉన్న రాష్ట్ర మాజీ ఆహార మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్‌కు షాజహాన్ సన్నిహితుడని సమాచారం. ఈడీ బృందంతో పాటు వచ్చిన సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. #nia #west-bengal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి