ICC World Cup: వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ రోజున.. ఢిల్లీలో మద్యం నిషేధం.. ఎందుకంటే..

ఢిల్లీలో ఆదివారం డ్రై డేను నిర్వహించనున్నారు. ఛట్‌పూజ సందర్భంగా ఆ రోజున మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి సర్కార్ ప్రకటించింది. ఛట్‌పూజతో పాటు ఆరోజు జాతీయ పండుగలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

New Update
AP : ముందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్కార్.. రెండు రోజులు పండగే

ఆదివారం వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. భారత్‌,ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌ కప్‌ను ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆరోజున ఢిల్లీలో మద్యం అమ్మకాలను నిషేదిస్తూ డ్రై డే పాటించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మేరకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కమీషనర్‌ కిషన్‌మోహన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆరోజున ఢిల్లీలో ఛట్‌ పూజ జరగనుంది. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

Also read: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ డైరెక్ట్ అటాక్.. వాడో పిచ్చికుక్క, రైఫిల్ రెడ్డి..

ఛట్‌పూజ రోజున భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి.. సూర్యునికి ప్రత్యేకమైన నైవేద్యం పెట్టి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆ రోజున మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నామని ఆప్‌ సర్కార్‌ తెలిపింది. అంతేకాదు.. కేవలం ఛట్‌పూజ మాత్రమే కాకుండా ఆరోజున జాతీయ పర్వదినాలు, పండుగలు ఉన్న నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న 637 మద్యం దుకాణాలను హోలీ, గాంధీ జయంతి, దసరా, దీపావళి పండుగ రోజుల్లో కూడా మూసివేశారు.

అయితే వరల్డ్‌కప్ ఫైనల్ రోజున టీమిండియా జట్టు గెలిస్తే.. అందరూ కూడా.. ముఖ్యంగా క్రికెట్‌ అభిమానులు ఘనంగా సెలబ్రేషన్స్‌ చేసుకుంటారు. ఇక చాలామంది ఆ సంతోషకమరమైన సమయంలో మద్యం సేవించేందుకే ఇష్టపడతారు. అయితే ఢిల్లీలో ఆరోజు మద్యం నిషేధం కావడంతో.. ఢిల్లీ వాసులు మద్యంతో చేసుకునే సెలబ్రేషన్స్‌కు దూరం కానున్నారు.

Also read: వరల్డ్‌కప్‌ ట్రోఫీతో రోహిత్, కమ్మిన్స్‌ ఫొటో షూట్.. పిక్స్ వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు