Jobs: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!

టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ట్రాన్స్ కోలోని మూడు డైరెక్టర్ పోస్టులు, జైన్ కోలోని ఐదు డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

New Update
Jobs: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!

Jobs:  టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో(TS Trans Co., Gen Co) డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ట్రాన్స్ కోలోని మూడు డైరెక్టర్ పోస్టులు, జైన్ కోలోని ఐదు డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు విద్యుత్ సౌధ(Electricity building)లోని సీఎండీ కార్యాలయానికి దరఖాస్తు పంపించాలని సూచించారు. దరఖాస్తు ఫారమ్ తోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జతచేయాలని తెలిపారు. ట్రాన్స్ కో డైరెక్టర్ పోస్టులకు అయితే [email protected] కు, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు అయితే [email protected]కు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు పంపించవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రాత్రి పడుకునేముందు ఇవి తింటే..హాయిగా నిద్ర పడుతుంది…!!

అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 63ఏళ్లకు మించి ఉండకూడదు. సంబంధింత రంగంలో కనీసం 15ఏళ్ల అనుభవం ఉండాలి. మొత్తంగా 25ఏళ్లపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అండర్ టేకింగ్ సంస్థల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు రెండేళ్లపాటు డైరెక్టర్ గా కొనసాగుతారని..అవసరమైతే ఒక్కో ఏడాది చొప్పున మరో రెండు ఏళ్ల పొడిగింపు ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించారు. మొత్తం నాలుగేళ్లు కొనసాగవచ్చని..డైరెక్టర్ సెలక్ట్ అయిన వారికి మొత్తంగా రూ. 1.50లక్షల జీతం రూ. 30వేల ఇతర అలవెన్సు లకూడా ఉంటాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు