సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల స్వీకరణ.. పోలింగ్..ఫలితాలు అదేరోజు ఏపీలో పంచాయతీలకు సర్పంచ్‌లు, వార్డుసభ్యుల ఎన్నిక జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ను విదుదల చేసింది జారీ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధనల ప్రకారం నేడు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదేరోజు ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు.నేటి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లపై అభ్యంతరాలను 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయవచ్చు. By Vijaya Nimma 07 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి పంచాయతీలకు సర్పంచ్‌లు, వార్డుసభ్యుల ఎన్నిక జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నిన్న (ఆదివారం) నోటిఫికేషన్‌ను జారీ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. ఇవాళ్టి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 10వ తేదీ సా. 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లపై అభ్యంతరాలను 12వ తేదీ సా. 5 గంటల్లోగా తెలియజేయవచ్చు. 13న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలన చేస్తారు. 14న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదే రోజు మ.3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. 19న ఉ. 7 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు మ.2 గంటల నుంచి కౌంటింగ్ జరిపి తుది ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఏదైనా కారణాలతో ఎన్నికలు నిలిచిపోతే ఈనెల 20న రీపోలింగ్ నిర్వహిస్తారు. అయితే .. కృష్ణా జిల్లాకు సంబంధించి కోకనా రాయణపాలెం, కొంగంచర్ల పంచాయతీ సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. వార్డు సభ్యులకు సంబంధించి గుడ్లవల్లేరు మండలం గాదేపూడి 3వ వార్డు, వేమవరం 3వ వార్డు, ఉలవలపూడి 6వ వార్డు, శేరిదగ్గుమిల్లి 6వ వార్డుకు, నందివాడ, బంటుమిల్లి, గూడూరు, దపారుపూడి, కంకిపాడు, బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, ఉయ్యూరు,పెడన, పమిడి ముక్కల మండలంలోని పుట్టగుంట 9వ వార్డు, చినతుమ్మిడి 8వ వార్డు, బంటుమిల్లి 4వ వార్డు, పోలవరం 11వ వార్డు, జక్కంచర్లలోని 1వ వార్డు, ఆకులమన్నాడులోని 2వ వార్డుకు, పాములపాడులోని 4వ వార్డు, వెంట్రప్రగడలోని 12వ వార్డు, తెన్నేరులోని 7వవార్డు, ప్రొద్దుటూరులోని 4వ వార్డు, కంకిపాడు పంచాయతీలలోని 9వ వార్డుకు, మల్లవల్లిలోని 6వ వార్డు, ఎ-సీతారామపురంలోని 6వ వార్డు, ఓగిరాలలోని 2వ వార్డు, వీరవల్లిలోని 11వ వార్డు, అమరాపురంలోని 7వ వార్డుకు, ఎన్‌ఏపేటలో 4వ వార్డు, తుట్టగుంటలోని 5వ వార్డు, గారపాడులోని 8వ వార్డు, తేలప్రోలులోని 4వ వార్డుకు, ముస్తాబాదలోని 1వ వార్డు, కొండపావులూరులోని 6వ వార్డు, చినఅవుటపల్లి పంచాయతీలోని 6వ వార్డుకు, గండిగుంటలోని 10వ వార్డుకు, కాకర్లమూడిలోని 4వ వార్డుకు, అలీనఖీపాలెం పంచాయతీలోని 6వ వార్డుకు ఎన్నికలు జరుగుతాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాలోని దాచవరం, పెదమోదుగుపల్లి, మల్కాపురం పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. వీటితోపాటు నందిగామ, వీరులపాడు,తిరువూరు, కంచికచర్ల, పెనుగంచిప్రోలు, వత్సవాయు, చందర్లపాడు, జగ్గయ్యపేట మండలలోని తొర్రగుడిపాడులో 8వ వార్డుకు, దొడ్డదేవరపాడు 6వ వార్డుకు, జమ్మవరం 8వ వార్డుకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎర్రమాడులో 7వ వార్డు, వామకుంట్లలో 8వ వార్డుకు, కొత్తపేటలో 7వ వార్డుకు, లింగంగూడెంలో 2వ వార్డు, పెనుగంచిప్రోలు పంచాయతీలో 6వ వార్డుకు ఎన్నికలు నిర్వహిస్తారు. శింగవరం పంచాయతీలో 6వ వార్డుకు, పొక్కునూరు పంచాయతీలో 5వ వార్డుకు, అనుమంచిపల్లిలో 4వ వార్డుకు, విజయవాడ రూరల్ ఉన్న 9వ వార్డుకు, ఎన్నికలు నిర్వహిస్తారు. #ap #arpanch-and-ward-member-recruitment #19th-of-this-month-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి