సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొంది 'రూల్స్ రంజన్' చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ నెల 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.

New Update
సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో వస్తున్న సినిమా ఇది. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నాడు. అతి కొద్ది కాలంలోనే యూత్ కు ఎంతో దగ్గరైన కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా విడుదల తేదీని, ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చిత్ర ట్రైలర్ ను సెప్టెంబర్ 8న ఉదయం 11:22 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా నుంచి మరో కొత్త సాంగ్ ను మీడియాకు ప్రత్యేకంగా చూపించారు.

హీరో కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటంతో పాటు, పూర్తి స్థాయి వినోదభరితంగా ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అమ్రిష్ గణేశ్ సంగీతం అందిస్తున్నాడు.

నిజానికి సెప్టెంబర్ 28న సలార్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో రూల్స్ రంజన్ సినిమాను ఆ తేదీకి విడుదల చేయడానికి నిర్ణయించారు. అలా అని కిరణ్ అబ్బవరం సినిమాకు పోటీ లేదనుకుంటే పొరపాటే. స్కంద రూపంలో రూల్స్ రంజన్ కు గట్టిపోటీ ఎదురుకాబోతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు