Kim Pleasure Squad:  నియంత కిమ్ మరో నిర్వాకం.. 25 మంది స్కూలు అమ్మాయిలను అలా వాడతాడట 

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ చేసే అరాచకాలకు అంతే లేదు. తాజాగా ప్రతి ఏటా 25మంది స్కూల్ అమ్మాయిలను ప్లెజెంట్ స్క్వాడ్ పేరుతో తన అవసరాలకు ఉపయోగించుకుంటున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు పూర్తిగా ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

New Update
Kim Pleasure Squad:  నియంత కిమ్ మరో నిర్వాకం.. 25 మంది స్కూలు అమ్మాయిలను అలా వాడతాడట 

Kim Pleasure Squad: ఉత్తర కొరియా అంటే వెంటనే గుర్తు వచ్చేది ఆ దేశ పాలకుడు.. నియంత కిమ్ జోంగ్-ఉన్ (Kim Jong Un). కిమ్ అని మనం చెప్పుకునే ఇతనికి సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రావు. అప్పుడప్పుడు బయటకు వచ్చిన విషయాలు విపరీతమైన సంచలనం కలిగిస్తాయి. ఇదిగో ఇప్పుడు తాజాగా ఒక విషయం వైరల్ అవుతోంది. కిమ్ నిర్వాకానికి సంబంధించి ఈ విషయం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ విషయం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

చిన్న వయసులోనే ఉత్తర కొరియా నుంచి తప్పించుకు వచ్చిన ఒక యువతి  యోన్మీ పార్క్ (Yeonmi Park)  చెప్పిన ఈ కథనం వింటే మతిపోతుంది. నియంత కిమ్ జోంగ్-ఉన్ కు సేవలు చేయడానికి ఒక  "ప్లెజర్ స్క్వాడ్" (Kim Pleasure Squad)ఉంటుందట. దీనికోసం ప్రతి సంవత్సరం 25 మంది కన్యలను ఎంపిక చేస్తారు. ఈ అమ్మాయిలను వారి అందం.. ఆకర్షణ అదేవిధంగా రాజకీయ విధేయత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ప్లెజర్ స్క్వాడ్ కోసం యోన్మీ పార్క్ రెండు సార్లు ఎంపిక కోసం ప్రయత్నించారనీ, అయితే, తన కుటుంబ స్థితి కారణంగా ఎంపిక చేయలేదనీ చెప్పింది. ఈ స్క్వాడ్ కోసం అందమైన అమ్మాయిలను ఎంపిక చేసే ప్రక్రియ లో మొదట అందమైన అమ్మాయిలను గుర్తించేందుకు.. అధికారులు స్కూల్స్ లో వేడుకుంటారు. కొంతమంది అమ్మాయిలను గుర్తించిన తరువాత వారి కుటుంబ స్థితి, రాజకీయ స్థితిని చెక్ చేస్తారు. ఉత్తర కొరియా నుండి తప్పించుకున్న కుటుంబ సభ్యులు లేదా దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులు ఉన్న అమ్మాయిలను వారు తొలగిస్తారు, ”అని యోన్మీ పార్క్ చెప్పినట్టు  ది డైలీ స్టార్ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

Also Read: పెట్రోల్ తెగ వాడేస్తున్నారు.. డిమాండ్ తగ్గిన డీజిల్

ఈ కథనంలో ప్లెజర్ స్క్వాడ్  కి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం.. కిమ్ జోంగ్-ఉన్ అంతర్గత సర్కిల్‌లోని అశాంతికరమైన పద్ధతులు మనకి షాక్ ఇస్తాయి. మొదటి దశలో ఎంపిక చేసిన అమ్మాయిల కన్యత్వాన్ని ధృవీకరించడానికి వైద్య పరీక్షలతో సహా కఠినమైన పరిశీలన ఉంటుంది. శరీరంపై ఎక్కడైనా  చిన్న చిన్న మచ్చలు వంటి చిన్న లోపాలు అనర్హతకు దారితీస్తాయి. ఉత్తర కొరియా అంతటా ఎంపిక చేయబడిన కొంతమంది అమ్మాయిలు మాత్రమే ప్యోంగ్యాంగ్‌కు మారుస్తారు.  ఇక్కడ ఈ కన్యల ఏకైక పని  నియంత కోరికలను తీర్చడం.

1970ల నుంచీ..
ఈ "ప్లెజర్ స్క్వాడ్" మూలాలు 1970లలో కిమ్ జోంగ్-ఇల్ యుగం (కిమ్ జోంగ్-ఉన్ తండ్రి) నాటివి. కిమ్ జోంగ్-ఇల్ మొదట్లో తన తండ్రి కిమ్ ఇల్-సుంగ్ (కిమ్ జోంగ్-ఉన్ తాత)ని సంతోషపెట్టడానికి అలాగే, అతని వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ పద్దతిని రూపొందించాడు. ఇంకా.. ఇప్పుడు ఈ స్క్వాడ్ చాలా అభివృద్ధి చెందింది. కిమ్ జోంగ్-ఇల్ పొడవాటి మహిళలను ఇష్టపడతాడు.  అయితే కిమ్ జోంగ్-అన్ మరింత సన్నని అమ్మాయిలు..  "పాశ్చాత్యత కనిపించే" లక్షణాలను ఇష్టపడతాడు. 

మూడు గ్రూపులుగా..
పార్క్ చెప్పిన దాని ప్రకారం "ప్లెజర్ స్క్వాడ్"(Kim Pleasure Squad) మూడు విభిన్న గ్రూపులుగా ఉంటుంది. ఒక గ్రూప్ మసాజ్‌లో నైపుణ్యం కలిగి ఉంటుంది. మరొక బృందం కిమ్ జోంగ్-అన్ - అతని సహచరులకు వినోదాన్ని అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంటుంది.  ఇందులో మోరన్‌బాంగ్ బ్యాండ్‌గా బహిరంగంగా కనిపించడం కూడా ఉంటుంది. ఇక  "లైంగిక కార్యకలాపాల విభాగం" అని పిలువబడే మూడవ గ్రూప్ నియంత - ఇతర అధికారులతో సన్నిహిత సంబంధాలతో పని చేస్తుంది .

తల్లిదండ్రులను హింసించి..
తమ అమ్మాయిలు  స్క్వాడ్‌ లో చేరడానికి తల్లిదండ్రులను ఒప్పించే విధానం భయంకరంగా ఉంటుందని పార్క్ చెప్పింది.  ఈ స్క్వాడ్ సభ్యులు ఇరవైలలోకి చేరుకున్నప్పుడు వారి పని ముగిసిపోతుంది. వారు సాధారణంగా నాయకుడి అంగరక్షకులను వివాహం చేసుకుంటారు. 

ఇదీ కిమ్ రాసలీలల అరాచకం. ఉత్తర కొరియా నియంతగా కిమ్ చేస్తున్న దాష్టీకం. ఇప్పుడు ఈ ప్లెజర్ స్క్వాడ్ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.

New Update
Taliban's

Taliban's

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.


'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read :  Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం..  కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!

ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం

భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు.  పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం  తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు.  ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్...  ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.  తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.

Also Read :  BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?

Advertisment
Advertisment
Advertisment