Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ! తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. By srinivas 25 Apr 2024 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Nominations : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు. రేపు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగుననున్న సంగతి తెలిసిందే. కాగా నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా 25 వరకు నామినేషన్లను ఈసీ స్వీకరించింది. తెలంగాణ, ఏపీలోనూ ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అసెంబ్లీకి 3,300కు పైగా నామినేషన్లు వేయగా.. చివరి రోజు పులివెందులలో నామినేషన్ వేశారు ఏపీ సీఎం జగన్. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకూ లోక్‌సభ నియోజక వర్గాలకు 731, శాసన సభనియోజక వర్గాలకు 4,210 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. ఇది కూడా చదవండి: AP : గుంటూరులో కలకలం.. విడదల రజిని కిడ్నాప్! తెలంగాణలో చివరిరోజు దాఖలైన నామినేషన్ల వివరాలు.. హైదరాబాద్-48 కరీంనగర్-69 ఖమ్మం-57 మహబూబాబాద్-32 ఆదిలాబాద్- 39 భువనగిరి- 81 చేవెళ్ల-59 మహబూబ్ నగర్-42 మల్కాజిగిరి-101 మెదక్-55 నాగర్ కర్నూల్-23 నల్గొండ-85 నిజామాబాద్-77 పెద్దపల్లి-74 సికింద్రాబాద్-60 వరంగల్-62 జహీరాబాద్-41 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై పోల్ కు 38 నామినేషన్లు ధాఖలయ్యాయి. #nominations #telugu-states #process-complete మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి