Bank Server Hacking : బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌.. 5 రోజుల్లో 16 కోట్లు విత్ డ్రా!

దేశ రాజధానికి దగ్గర్లో ఉన్న నోయిడాలోని నైనిటాల్‌ బ్యాంక్‌ లో సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు సర్వర్‌ ని ట్యాప్‌ చేసి ఆర్టీజీఎస్‌ ని హ్యాక్‌ చేశారు. ఈ క్రమంలోనే నిందితులు కేవలం ఐదు రోజుల్లో బ్యాంకు నుంచి సుమారు రూ. 16 కోట్ల ఒక లక్ష 3 వేలను వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు.

New Update
Bank Server Hacking : బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌.. 5 రోజుల్లో 16 కోట్లు విత్ డ్రా!

Nainital Bank Server Hacked : గతంలో బ్యాంకులను దోచుకోవాలంటే..పెద్ద పెద్ద ఆయుధాలతో బ్యాంకు లోపలికి వెళ్లి దోచుకునే వారు... కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చునే కోట్లకు కోట్లు కొలగొట్టేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి దేశ రాజధానికి దగ్గర్లో ఉన్న నోయిడా (Noida) లోని నైనిటాల్‌ బ్యాంక్‌ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సైబర్‌ నేరగాళ్లు (Cyber Criminals) బ్యాంకు సర్వర్‌ ని ట్యాప్‌ చేసి ఆర్టీజీఎస్‌ ని హ్యాక్‌ చేశారు.

ఆ తరువాత నిందితులు సుమారు రూ. 16 కోట్ల ఒక లక్ష 3 వేలను వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌ ను సరిచేసే సమయంలో ఈ విషయం తెలిసింది. దీంతో బ్యాంక్‌ ఐటీ మేనేజర్‌ సుమిత్‌ శ్రీవాస్తవ నోయిడాలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేశారు.

ఇది కాకుండా.. ఈ విషయం పై దర్యాప్తు చేయవలసిందిగా బ్యాంక్‌ సీఈఆర్‌టీ-ఇన్‌ (CERT-IN) ని కూడా అభ్యర్థించింది. గత నెల జూన్‌ 17న ఆర్టీజీఎస్‌ ఖాతాల బ్యాలెన్స్‌షీట్‌ తేడా వచ్చిందని నోయిడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఐటీ మేనేజర్‌ సుమిత్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సమయంలో అసలు రికార్డులో రూ.36 కోట్ల 9 లక్షల 4 వేల 20 తేడా ఉన్నట్లు గుర్తించారు.

నగదు పెద్ద మొత్తంలో కావడంతో కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విచారణ చేపట్టారు. ఇందులో బ్యాంకు సర్వర్‌లో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. సిస్టమ్ లైన్‌లో లోపం కారణంగా ఈ మొత్తం సరిపోవడం లేదని ప్రాథమిక దర్యాప్తు అనుమానం వ్యక్తం చేసింది.

అయితే జూన్ 20 న ఆర్బీఐ వ్యవస్థను సమీక్షించినప్పుడు, 84 అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు కనుగొనబడింది. ఈ లావాదేవీలన్నీ జూన్ 17 నుంచి 21 మధ్య జరిగినట్లు ఐటీ మేనేజర్ తెలిపారు. RTGS సెటిల్‌మెంట్ ద్వారా ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు.

Also read: వైసీపీ నుంచి బాలినేని జంపింగ్‌ జంపాంగా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు