Fire Accident : మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు!

నోయిడా లోని సెక్టార్-32లోని హార్టికల్చర్ డంపింగ్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 15 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి.

New Update
Breaking : ఘోర అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 10 ఫైర్‌ ఇంజిన్లు!

Metro : నోయిడా(Noida) లోని సెక్టార్-32లోని హార్టికల్చర్ డంపింగ్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 15 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి. గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ చౌబే మాట్లాడుతూ.. ఈ డంపింగ్ గ్రౌండ్‌(Dumping Ground) లో మంటలు చెలరేగినట్లు సాయంత్రం 6 గంటల సమయంలో సమాచారం అందిందని తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి 6 అగ్నిమాపక యంత్రాలను పంపారు. అయితే మంటలు ఉన్న ప్రాంతం అంతా ఎండిపోయి ఉండడంతో మంటలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో ఘటనా స్థలానికి మరిన్ని వాహనాలను పంపినట్లు అధికారులు వివరించారు.

మొత్తంగా ఘటనా స్థలంలో 15 వాహనాలు మంటలు ఆర్పుతున్నట్లు అధికారులు వివరించారు. దీనికి తోడు ఈదురు గాలులు వీయడంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఘటనాస్థలిని పరిశీలిస్తే మంటలు ఆర్పేందుకు మూడు రోజులు పడుతుందని, మంటలు పూర్తిగా చల్లారేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను ప్రజలు సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేశారు. చెత్తను శుభ్రం చేసేందుకు అక్కడ ఉన్న చెత్త కుప్పకు నిప్పంటించారని, అది మొత్తం డంపింగ్ యార్డుకు వ్యాపించిందని ప్రజలు పేర్కొన్నారు. చెత్తను శుభ్రం చేయడానికి నిప్పు పెట్టే చెత్త సేకరణ ఏజెన్సీలను కూడా వినియోగదారులు విమర్శించారు.

గతేడాది కూడా ఇదే మైదానంలో భారీ అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. ఆ సమయంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేందుకు వారం రోజుల సమయం పట్టింది. ఆ సమయంలో మంటలు చెలరేగడంతో సమీపంలోని నివాస గృహాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Also Read : తిప్పతీగ తో మధుమేహనికి చెక్‌ పెట్టేద్దామా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మాజీ క్రికెటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష

గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి కస్టడీలో ఉంటున్న అతనిది సస్పెన్షన్‌తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు. వచ్చే ఐదేళ్లలో తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో ఉండాలి.

New Update
Former Australian cricketer Michael

Former Australian cricketer Michael

గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి స్లేటర్ కస్టడీలోనే ఉన్నాడు. అయితే అతనిపై ఉన్న అభియోగాలను అంగీకరించాడు. దీంతో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ అతనిది సస్పెన్షన్‌తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

వచ్చే ఐదేళ్లలో స్లేటర్‌ తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో పూర్తి శిక్షా కాలాన్ని పూర్తి చేయాల్సివుంటుంది. స్లేటర్‌ 1993లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో 73 టెస్టులు, 42  వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2004లో క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

 

 

Advertisment
Advertisment
Advertisment