NO Petrol: హైదరాబాద్‌లో పెట్రోల్ నిల్... జామ్ ఫుల్.. పెట్రోల్‌ బంకుల ముందు 'NO STOCK' బోర్డులు

హైదరాబాద్ లో వాహనదారులను పెట్రోల్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండో రోజు కూడా కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. డీజిల్ కొరత వల్ల ట్రాక్టర్లు దున్నకాలకు రాకపోవడంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారు.

New Update
No Petrol : రేపటి నుంచి పెట్రోల్ బంద్ అని ప్రచారం.. బంకుల ముందు భారీ క్యూలు

No Petrol In Hyderabad: వాహనదారులకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇటీవల చలానాపై రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించడంతో సంతోషంతో ఎప్పటి నుంచే పెండింగ్ లో ఉన్న పాత చలానాలు అన్ని కేట్టేసిన వాహనదారులకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో అన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఇది తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ALSO READ: BREAKING: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

మూడు రోజులు పెట్రోల్ బంకులు బంద్?

నిన్న (మంగళవారం) మూడు రోజులపాటు పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి అని ప్రచారం జరగడంతో వాహనదారులందరూ పెట్రోల్ బంకుల ఎదుట క్యూ కట్టారు. రోడ్డు పక్కనే పెట్రోల్‌ బంకులుండటంతో హైదరాబాద్ నగరంలో నిన్న ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు పెట్రోల్ బంకుల ఎదుట గంటల కొద్దీ వెయిట్ చేశారు. మరోవైపు కొన్ని బంకుల్లో పెట్రోల్ నిలువ లేకపోవడంతో నో స్టాక్ బోర్డలు ఏర్పాటు చేశారు. కొన్ని బంకులు నిన్న, ఈరోజు కూడా మూతపడ్డాయి. ఈ రోజు కూడా హైదరాబాదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరతతో వాహదారులు ఇబ్బంది పడుతున్నారు.

డీజిల్ లేదు.. దున్నుడు కాలే.. రైతన్న ఇక్కట్లు..

పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఉండడంతో రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అసలే నాట్లు వేసే సమయం డీజిల్ కొరత ఉండడంతో పొలాలు దున్నేందుకు డ్రైవర్లు రావడం లేదు. దీంతో చేసేది ఏమి లేక రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఎదిగిన నారు సమయానికి నాటు వెయ్యకపోతే పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రైతు బంధు డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది మరొక ఇబ్బందిగా మారింది.

ALSO READ: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఎట్టకేలకు సమ్మె విరమించారు..

పెట్రోల్, డీజిల్ కొరత రావడానికి డ్రైవర్ల సమ్మె కారణం. కేంద్ర తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా మూడ్రోజుల సమ్మె చేపట్టారు ట్రక్కు డ్రైవర్లు. ట్రక్కులు, భారీ వాహనాల సమ్మెతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో కొత్త చట్టంపై వెనక్కి తగ్గింది కేంద్రం. చర్చల తర్వాతే హిట్‌ అండ్‌ రన్‌ అమలు చేస్తామని ప్రకటన చేసింది. కేంద్రం హామీతో సమ్మె విరమించారు ట్రక్కు డ్రైవర్లు.

Advertisment
Advertisment
తాజా కథనాలు