Hijab Ban: 'అబ్బే..ఇంకా నిర్ణయం తీసుకోలేదు..' హిజాబ్‌ బ్యాన్‌పై కర్ణాటక సీఎం కొత్త ప్రకటన!

విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఫైనల్‌ డిసిషన్‌ తీసుకోలేదని.. నిషేధాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని క్లారిటీ ఇచ్చారు.

New Update
Hijab Ban: 'అబ్బే..ఇంకా నిర్ణయం తీసుకోలేదు..' హిజాబ్‌ బ్యాన్‌పై కర్ణాటక సీఎం కొత్త ప్రకటన!

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ను గత బీజేపీ ప్రభుత్వం బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అక్కడి హైకోర్టు సైతం సమర్థించింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఇలాంటి రూల్స్‌ని బ్యాక్‌ తీసుకుంటామని.. స్వేచ్ఛకు పెద్దపీట వేస్తామని కన్నడనాట కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని చేసింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల తర్వాత హిజాబ్‌ వివాదంపై స్పందించారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన సిద్ధరామయ్య... నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు నిన్న(డిసెంబర్ 22) ట్వీట్ చేశారు. ఇవాళ మాత్రం ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదని మరో ప్రకటన చేశారు.

ఇంకా తీసుకోలేదు:
కర్ణాటకలో గత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ప్రభుత్వం విధించిన హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం ఇంకా వెనక్కి తీసుకోలేదని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 'మేము ఇంకా (హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవడం) చేయలేదు. ఎవరో నన్ను హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడంపై ఒక ప్రశ్న అడిగారు.. నేను దానిని రద్దు చేయాలని.. ప్రభుత్వం పరిశీలిస్తోందని బదులిచ్చాను' అని సీఎం చెప్పారు. విద్యాసంస్థల్లో మతపరమైన కండువా ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, దుస్తులు, ఆహార ఎంపిక వ్యక్తిగతమని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ క్లారిటీ రావడం విశేషం.

తీవ్ర రచ్చరాజేసిన వివాదం:
కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని భారతీయ జనతా పార్టీ (గత ప్రభుత్వం) నిషేధించింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ వ్యవహారం హైకోర్టుకు కూడా చేరింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిషేధాన్ని తొలగించింది. 2022లో బీజేపీ-బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధించిన తర్వాత రాష్ట్రంలో నెల రోజుల పాటు వివాదం నెలకొంది. ఈ ఉత్తర్వుపై పిటిషన్లు దాఖలైన తర్వాత, కర్ణాటక హైకోర్టు కూడా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదని, రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో యూనిఫాం డ్రెస్ కోడ్ పాటించాలని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని ఉడిపిలో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్‌ ధరించడం వల్లే తమను తరగతులకు హాజరుకాకుండా నిలిపివేశారని జిల్లాలోని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. కర్ణాటక హైకోర్టు నిరాశపరిచిన తర్వాత, దీనిపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

Also Read: రాయుడుని రిప్లేస్‌ చేసే ఆటగాడు అతడే.. అసలు విషయం చెప్పేసిన ధోనీ టీమ్ సీఈవో!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు