లోక్‌సభలో అవిశ్వాస యుద్ధం..

నిశికాంత్ స్పీచ్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌పై నిన్న దూబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చైనా నుంచి డబ్బు వచ్చిందన్న దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఆ మాటల్ని ప్రసంగం నుంచి స్పీకర్ తొలగించారు. కానీ తొలగించిన దూబే స్పీచ్‌ను లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

author-image
By G Ramu
New Update
లోక్‌సభలో అవిశ్వాస యుద్ధం..

విపక్ష పార్టీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఈ రోజు చర్చ మొదలైంది. మణిపూర్ హింసాకాండ అంశంలో కేంద్రాన్ని లోక్ సభలో విపక్ష పార్టీలు తూర్పార పట్టాయి. మణిపూర్ అంశంపై మోడీ మౌన వ్రతం పాటిస్తున్నారని ఫైర్ అయ్యాయి. ఆయన మౌనాన్ని వీడాలనే ఉద్దేశంతోనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టామని విపక్ష ఇండియా కూటమి సభ్యులు వెల్లడించారు. భావించారు.

మూడు రోజుల పాటు ఈ చర్చ కొనసాగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్ కు ఒక గంటపావు సమయాన్ని కేటాయించినట్టు సమాచారం. మంగళ, బుధవారాల్లో అవిశ్వాస తీర్మానంపై పలు పార్టీలు మాట్లాడనున్నాయి. అనంతరం ఆ ప్రశ్నలకు ప్రధాని మోడీ గురువారం సమాధానం ఇవ్వనున్నారు.

ఎవరి బలం ఎంతంటే..!

ఇక అవిశ్వాస తీర్మానం వీగే పోయే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. లోక్ సభలో మొత్తం 537 స్థానాలు వున్నాయి. అందులో అధికార ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యులు బలం ఉంది. ఇక విపక్ష ఇండియా కూటమికి 141 మంది సభ్యులు వున్నారు. ఏ పార్టీకి చెందని సభ్యులు 60 మంది వున్నారు. చివరి క్షణంలో వాళ్లు మనసు మార్చుకుని విపక్ష ఇండియా వైపు నిలిచినా తీర్మానం నెగ్గే అవకాశం కనిపించడం లేదు.

publive-image

పార్లమెంట్ లో మాట్లాడకూడదని ప్రధాని మోడీ మౌనవ్రతం చేపట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ మౌన వ్రతాన్ని వీడేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు వచ్చామన్నారు. ఆయనకు తాము మూడు ప్రశ్నలు సంధించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అందులో 1, మణిపూర్ తగలబడి పోతుంటే ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించలేదో తెలపాలని డిమాండ్ చేశారు.

publive-image

మణిపూర్ పై మాట్లాడేందుకు ఆయనకు 80 రోజుల సమయం ఎందుకు పట్టిందని నిలదీశారు. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ను ఎందుకు పదవి నుంచి తొలగించలేదని ఆయన ఫైర్ అయ్యారు. అనంతరం అవిశ్వాస తీర్మానం పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చర్చ మొదలు పెట్టగానే ప్రతిపక్షాలు రచ్చ చేశాయి. నిషికాంత్ దూబే ప్రసంగంపై విపక్షాలు తీవ్ర అ అభ్యంతరం వ్యక్తం చేశాయి.

publive-image

తమకు న్యాయం కావాలని మణిపూర్ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా అది దేశంలో ప్రతి చోట న్యాయానికి ముప్పుగా మారుతుందన్న మార్టిన్ లూథర్ కింగ్ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లగలిగినప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ఎందుకు మణిపూర్ వెళ్లలేదన్నారు.

publive-image

నిషికాంత్ దూబే ఏమన్నారంటే....!

అనంతరం బీజేపీ తరఫున నిషికాంత్ దూబే చర్చను ప్రారంభించారు. చర్చ సందర్భంగా మోడీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్దరణ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ఈ కేసులో సుప్రీం కోర్టు కేవలం స్టే ఆర్టర్ మాత్రమే ఇచ్చిందన్నారు. అంతే కానీ పూర్తిగా తీర్పు ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ అంటున్నారని అన్నారు. నేను సావర్కర్ కానని రాహుల్ గాంధీ అంటున్నారని, రాహుల్ గాంధీ ఎప్పుడూ సావర్కర్ కాలేడన్నారు.

తాను సోనియా గాంధీని గౌరవిస్తానన్నారు. ఆమె ముందుకు ఇప్పుడు రెండు పనులు వున్నాయన్నారు. అందులో ఒకటి కుమారుడు రాహుల్ గాంధీని సెట్ చేయడం, మరొకటి అల్లుడు రాబర్ట్ వాద్రాకు గిఫ్టులు ఇవ్వడమన్నారు. ఇది అవిశ్వాస తీర్మానం కాదని, ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో చూడడానికి ప్రతిపక్షానికి ఇది విశ్వాస తీర్మానం అని ప్రధాని మోడీ ముందే చెప్పారన్నారు.

టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ ఏమన్నారంటే....

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రధాని మోడీకి నమ్మకం లేదన్నారు. ఇాది హృదయం లేని కఠినాత్ముల ప్రభుత్వమన్నారు. ఏ అభ్యర్థన వచ్చినా ఓ ప్రతినిధుల బృందాన్ని పశ్చిమ బెంగాల్ కు పంపుతోందన్నారు. కానీ మణిపూర్ కు మాత్రం ఒక్క ప్రతినిధి బృందాన్ని కూడా పంపలేదన్నారు. మీకు దయలేదని, అందుకే మీ ప్రభుత్వం మణిపూర్ కు వెళ్లలేదని ఫైర్ అయ్యారు.

శ్రీకాంత్ షిండే ఏమన్నారంటే...!

అవిశ్వాస తీర్మానంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఎన్డీఏ సర్కార్ కు అనుకూలంగా మాట్లాడారు. విపక్ష కూటమి తన గత చరిత్ర పట్ల అవమానంగా ఫీల్ అయిందని, అందుకే విపక్ష కూటమి తన పేరును యూపీఏ నుంచి ఇండియాగా మార్చుకుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు