భారత్-చైనా కమాండర్ స్థాయి 19 వ రౌండ్ సమావేశాలు....ఆ అంశాలపై లోతైన చర్చలు...!

వాస్తవాధీన రేఖ వద్ద చుషుల్- మోల్డో సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా అధికారుల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య ఈ నెల 13, 14 తేదీల్లో 19వ రౌండ్ సమావేశాలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి జరగలేదని తెలుస్తోంది.

author-image
By G Ramu
New Update

ఇరు దేశాల మధ్య సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవాధీన రేఖ వద్ద పశ్చిమ సెక్టార్ లోని అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారానికి ఇరు దేశాల అధికారులు లోతైన చర్చలు జరిపారని ప్రకటనలో వెల్లడించింది.

సరిహద్దుల వెంట మిగిలిన సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఇరు పక్షాల అధికారులు అంగీకరించినట్టు తెలిపింది. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాలని ఇరు పక్షాలు అంగీకరించాయని వెల్లడించింది.

గాల్వాన్ వ్యాలీ, పాంగ్ సో, గోగ్రా, హాట్ స్పింగ్ ప్రాంతాల్లో త్వరిత గతిన బలగాలను ఉపసంహరించాలని చైనాపై భారత్ ఒత్తిడి తీసుకు వచ్చింది. . దీంతో పాటు వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతను పూర్తిగా తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు నడిచాయి.. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఇరు పక్షాలకు చెందిన 60,000 బలగాలు వున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు