BSP Mayavathi:ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి..ఒంటరిగానే బరిలోకి

బహుజన్ సమాద్‌ వాదీ పార్టీ మాయావతి ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు.

New Update
BSP Mayavathi:ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి..ఒంటరిగానే బరిలోకి

No Alliance:పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ కలిసి పోటీ చేయమని తేల్చి చెప్పారు. అలాగే ఇండియా కూటమితో కూడా కలవమని అన్నారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాతనే పొత్తులు గురించి ఆలోచిస్తామని మాయావతి చెప్పారు. అప్పుడు పరిస్థితులను బట్టి పొత్తులు ఉండే ఉండొచ్చని మాయావతి అన్నారు.

Also Read:ఫాస్టాగ్‌లకు కేవైసీ లేకపోతే కట్..జనవరి 31 లాస్ట్ డేట్

మాకు పొత్తులు కలిసి రాలేదు...

ఇప్పటి వరకు తమ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన ప్రతీసారి చేదు అనుభవాలే ఎదురయ్యాయని... దీని వలన పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని మాయావతి అన్నారు. తమ ఓట్లు భాగస్వామ్య పక్షానికి వెళుతున్నాయి కానీ తమకు మాత్రం అటునుంచి ఓట్లు రావడం లేదని చెప్పారు. అందుకే ఈసారి పొత్తులు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నామని మాయావతి స్పష్టం చేశారు. దీంతో ఇండియా కూటమి విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. దానితో కూడా బీఎస్పీ పొత్తు వెళ్ళడం లేదని తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి.

తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే...

ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడారు. తన చివరి వ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. వెనకబడిన వర్గాల క్షేమం కోసం బతికున్నంతవరకు పని చేస్తూనే ఉంటానని చెప్పారు. రాజకీయాల్లో ఉంటేనే ఆ అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇక అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు తనకూ ఆహ్వానం అందిందని...అయితే వెళ్ళాలా, వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని మాయావతి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చాలా ఉన్నాయని...ఎన్నికల ప్రిపరేషన్ కూడా ఉన్నాయని చెప్పారు. తమది సెక్యులర్ పార్టీ అని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు