Nitish Kumar: భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్‌ దొరికాడు.. ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు!

ఐపీఎల్ సీజన్ 17లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతర్జాతీయస్థాయి బౌలర్లను అలవోకగా దంచికొడుతున్నాడు. కఠినమైన పిచ్‌పై ఒత్తిడి లేకుండా ఆడటం చూసి భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్‌ దొరికాడంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

New Update
Nitish Kumar: భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్‌ దొరికాడు.. ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు!

Cricket: భారత క్రికెట్ జట్టుకు మరో ఆణిముత్యం దొరికింది. సరైన ఆల్ రౌండర్లు లేక చాలా కాలంగా ఇబ్బంది పడుతుండగా తాజాగా ఐపీఎల్ సీజన్ 17లో నికార్సైన తెలుగు తేజం వెలుగులోకి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతున్న నితీశ్ కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy) తనదైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ 20 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయస్థాయి బౌలర్లను అలవోకగా దంచికొడుతున్నాడు. ట్రావిస్‌ హెడ్, అభిషేక్, క్లాసెన్‌ వంటి హిట్టర్లు తడబడిన వేళ కఠినమైన పిచ్‌పై బ్యాటింగ్‌లో విలువైన 64 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో వికెట్‌ తీసి ఔరా అనిపించాడు.

ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ..
అంతేకాదు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం చూసి ముచ్చటేసిందని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిస్తున్నాడు. అతడి ఆత్మవిశ్వాసం చూస్తుంటే తప్పకుండా భారత జట్టులోకి అడుగుపెడతాడని అంచనా వేస్తున్నారు. ఇక నితీశ్‌ రెడ్డి టాలెంట్‌ను మొదట మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ గుర్తించి.. అండర్-12, అండర్-14 మ్యాచ్‌ల సమయంలో అతడి ఆటను చూసిన ఎమ్మెస్కే ఏసీఏ అకాడమీకి పంపించారు. 2017-18 సీజన్‌ సందర్భంగా విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో నాగాలాండ్‌పై క్వాడ్రపుల్‌ (345 బంతుల్లో 441 పరుగులు) చేశాడు. ఆ టోర్నీలో 1,237 పరుగులు చేయడంతోపాటు 26 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాది ‘బెస్ట్ క్రికెటర్ అండర్ -16’గా జగ్మోహన్‌ దాల్మియా అవార్డును అందుకున్నాడు. నితీశ్‌ను సన్‌రైజర్స్‌ 2023లో రూ.20 లక్షల కనీస ధరతో సొంతం చేసుకుంది. తొలి సీజన్లో కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని.. చెన్నైతో మ్యాచ్‌లో లోయర్‌ ఆర్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో 8 బంతులకు 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్‌పై టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధసెంచరీతో అదరగొట్టాడు.

ఇది కూడా చదవండి: AP: ఏపీకి ఆమె లేడీ విలన్.. బతుకంతా దానికోసమే: పోసాని కాంట్రవర్సీ కామెంట్స్!

ఇక ఇప్పటివరకు 17 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన నితీశ్‌.. 29.96 సగటుతో 566 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 52 వికెట్లు పడగొట్టాడు. 22 లిస్ట్ - ఏ మ్యాచుల్లో 403 పరుగులు చేసి 11 వికెట్లు తీశాడు. తొమ్మిది టీ20ల్లో 170 పరుగులు, ఓ వికెట్ పడగొట్టాడు. 2020లో కేరళపై రంజీ అరంగేట్రం చేసిన నితీశ్‌ లోయర్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి 39 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతూ పాత్ర పోషించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు