చదువుకున్న భార్యల శృంగార వివాదంపై నితీశ్ కుమార్ యూటర్న్.. మళ్లీ ఏమన్నారో తెలుసా?

చదువుకున్న భార్యలు శృంగారంలో తమ భర్తలను కంట్రోల్ చేయగలరనే వ్యాఖ్యలపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ యూటర్న్ తీసుకున్నారు. తన మాటలతో తప్పుడు సందేశం వెళ్లడంతోపాటు స్త్రీల మనోభావాలు దెబ్బతీసినందుకు ముఖ్యమంత్రి సారీ చెప్పారు.

New Update
చదువుకున్న భార్యల శృంగార వివాదంపై నితీశ్ కుమార్ యూటర్న్.. మళ్లీ ఏమన్నారో తెలుసా?

చదువుకున్న భార్యలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరనే వ్యాఖ్యలపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ (Nitish Kumar)యూటర్న్ తీసుకున్నారు. తన మాటలతో తప్పుడు సందేశం వెళ్లినందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఆ వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, స్త్రీల మనోభావాలు దెబ్బతీసినందుకు ముఖ్యమంత్రి సారీ చెప్పారు.

ఈ మేరకు బిహార్‌ (Bihar)కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు నితీశ్. ఈ సందర్భంగా జనాభాను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. భార్య చదువుకున్నదైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుంది. తమ భర్తలను నియంత్రించగలరని వ్యాఖ్యానించారు. 'భర్తల చర్యల వల్ల గతంలో జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలుసు. అందుకే ఇప్పుడు బర్త్ రేటు తగ్గుతోంది' అంటూ కాస్త వ్యంగంగా కామెంట్స్ చేశారు. దీంతో ఆయన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో నితీశ్‌ తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారంటూ బీజేపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అసెంబ్లీలో ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి, వైద్యుడిని సంప్రదించాలంటూ విమర్శలు చేసింది. అలాగే ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్‌ రేఖా శర్మ స్పందిస్తూ.. నీతీశ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తాజాగా స్పందించిన నితీశ్ కుమార్.. 'నా వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నాను. నా మాటలతో తప్పుడు సందేశం వెళ్లి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటా' అన్నారు.

Also Read : ఓటర్ కార్డుల పంపిణీలో వేగం పెంచిన అధికారులు.. ఆ తేదీలోపే అందిస్తారట

ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారగా నితీశ్‌ వాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. అసెంబ్లీలో నితీశ్‌ వ్యాఖ్యలకు పురుష ఎమ్మెల్యేలు ముసిముసిగా నవ్వుకుంటే.. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు కాముకత, స్త్రీ ద్వేషంతో కూడినినవి, మహిళలను తీవ్ర అవమానించేలా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. నితీశ్‌ ఓ అసభ్యకరమైన నాయకుడు. ఇలాంటి వ్యక్తి భారత రాజకీయాల్లో మరొకరు కనిపించరంటూ బీజేపి నేతలు విమర్శలు చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాన్ని అభ్యంతరకరమైన తీరులో కాకుండా చక్కని మాటలతో చెప్పాల్సిందని బీజేపీ నేత తారా కిషోర్‌ ప్రసాద్‌ సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు