Khammam-Hyderabad: మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఓ శుభవార్తను తెలియజేశారు.టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

New Update
Nitin Gadkari: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

Khammam-Hyderabad: మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారా..అయితే మీకు కేంద్రం ఓ గుడ్‌ న్యూస్‌ ని తీసుకుని వచ్చింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఓ శుభవార్తను తెలియజేశారు.
బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని కలిసి... ఈ ఫ్లైఓవర్ కోసం విజ్ఙప్తి చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే 65పై ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.

Also read: ఇజ్రాయిల్‌ లో ఉండే భారతీయులు జాగ్రత్త..ఎంబసీ ఆదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు