Nirmala Sitaraman: ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బుల్లేవు: కేంద్ర మంత్రి! లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు. బీజేపీ తనకు రెండు సీట్లు ఇచ్చిందని, అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నా అన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే ఎన్నికల బరిలో నిలవడం లేదని తెలిపారు. By Bhavana 28 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Nirmala SitaRaman: దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala SitaRaman) ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో (Elections) పోటీ చేయడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు.బీజేపీ(BJP) తనకు రెండు సీట్లు ఇచ్చిందని, అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్మలా సీతారామన్ నిర్ణయించుకున్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు (Money) తన వద్ద లేవని ఆమె ఎన్నికల బరిలో నిలిచేందుకు తిరస్కరించారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా బీజేపీ అధిష్టానం నిర్మలా సీతారామన్‌కు రెండు సీట్ల ఆప్షన్ ఇచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా లేనని ఆమె బుధవారం ఓ కార్యక్రమంలో చెప్పారు. దానికి గల కారణాలు కూడా ఆమె వివరించారు. ఏపీ కానీ, తమిళనాడు నుంచి కానీ నన్ను ఎన్నికల బరిలో నిలవమని జేపీ నడ్డా తనకు ఆఫర్ ఇచ్చారని వివరించారు. అయితే ఈ విషయం గురించి నేను 10 రోజులు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తిరస్కరించానని ఆర్థిక మంత్రి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేదని మంత్రి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశ ఆర్థిక మంత్రి వద్ద డబ్బులు లేవా? ఈ ప్రశ్న ఆమెను అడగ్గా, నా జీతం, నా సంపాదన, నా పొదుపు మాత్రమే నా వద్ద ఉంది. దేశానికి సంబంధించిన డబ్బు నాది కాదు అంటూ ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ప్రచారంలో మాత్రం పాల్గొంటానని ఆమె వివరించారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్తానని ఆమె చెప్పారు. Also read: ఓటరు ఐడీ లేకపోయినా ఈ కార్డులతో ఓటు వేయవచ్చని మీకు తెలుసా! #elections #nirmala-sitaraman #lokasabha #bjo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి