Khammam Rains: హమ్మయ్య.. ఖమ్మంలో ఆ 9 మంది సేఫ్! ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. మున్నేరు వాగు చూసేందుకు వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు.స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచిబయటకు వచ్చారు By Bhavana 02 Sep 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Khammam Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. మున్నేరు వాగు ఉధృతంగా మారడంతో ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. అంతకుముందు ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపైకి (Prakash Nagar Bridge) వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao), అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటకు తీసుకుని వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, అప్పటికే స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచి బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. Also Read: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. బోటులో వెళ్తుండగా.. #khammam #thummala-nageswara-rao #telangana-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి